Gossip Garage : తెర మీదకి మళ్లీ ఫైర్ బ్రాండ్..! రాములమ్మ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అంటూ మీనాక్షి ఆరా!
రాములమ్మతో భేటీకి రెడీ అవుతున్నారని టాక్. ఇప్పుడేం జరగబోతోంది.. విజయశాంతి మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా..

Gossip Garage : రాములమ్మ.. ది ఫైర్ బ్రాండ్ ! ఆమె నిర్ణయాలు, వాదనలు, సంధించే ప్రశ్నలు.. రాజకీయాన్ని షేక్ చేస్తుంటాయ్. అలాంటి విజయశాంతి.. ఇప్పుడు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాములమ్మ.. పార్టీ అధికారంలో ఉన్నా సెలైంట్‌గానే కనిపిస్తున్నారు.
విజయశాంతి మౌనంపై కొత్త ఇంచార్జి మీనాక్షి ఆరా తీస్తున్నారు.. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు.. ఎందుకు మౌనంగా ఉన్నారు.. ఏం జరిగింది.. ఇలా ప్రతీ విషయం కూపీ లాగుతున్నారట. రాములమ్మతో భేటీకి రెడీ అవుతున్నారని టాక్. ఇప్పుడేం జరగబోతోంది.. విజయశాంతి మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా..
విజయశాంతి.. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా పనిచేశారు. తల్లి తెలంగాణ పేరుతో సొంతంగా పార్టీ పెట్టి.. ఆ తర్వాత కేసీఆర్ ఆహ్వానంతో.. దాన్ని అప్పటి టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. కారు పార్టీ నుంచి ఎంపీగా గెలిచి.. పార్లమెంటులోనూ తెలంగాణ వాణిని గట్టిగా వినిపించారు.
Also Read : మలక్ పేట శిరీష కేసులో బిగ్ ట్విస్ట్.. చంపింది అతడు కాదు ఆమె.. హత్యకు అసలు కారణమిదే..
గాంధీభవన్‌లో విజయశాంతి పేరు రీసౌండ్..
ఐతే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో.. కేసీఆర్‌తో విభేదించిన రాములమ్మ.. తెలంగాణ ఇచ్చిందే సోనియానే అంటూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హస్తం పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని.. ఆ తర్వాత కమలం పార్టీ గూటికి చేరిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకి ముందు బీజేపీకి గుడ్ బై చెప్పి.. మళ్లీ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. హస్తం పార్టీలోనే ఉన్నా.. ఆమె ప్రస్తుతం యాక్టివ్‌గా కనిపించడం లేదు. దీంతో రాములమ్మ ఎక్కడ అంటూ.. కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్.. ఫోకస్ పెట్టారట.
పార్టీ పవర్‌లోకి వచ్చాక సైలెంట్ అయిపోవడమేంటి..
కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం రాములమ్మ దూరంగా ఉంటున్నారు. ఏదైనా ఉంటే.. కొద్దిరోజుల ముందు వరకు.. ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యే వారు. ఐతే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. తెలంగాణ రాజకీయం రగిలిపోతున్నా.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నా.. రాములమ్మ మాత్రం రియాక్ట్ కావడం లేదు.
నిజానికి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. నేతలు ఎవరైనా సరే యాక్టివ్‌గా ఉంటారు. ఐతే విజయశాంతి మాత్రం.. పార్టీ పవర్‌లోకి వచ్చాక సైలెంట్ అయిపోవడం ఇంట్రస్టింగ్‌గా మారింది.
ఆమెను పార్టీ పిలవడం లేదా.. లేదంటే పార్టీ నేతల వైఖరి నచ్చక ఆమెనే దూరంగా ఉంటున్నారా అనే చర్చ నడుస్తోంది. ఎన్నికల టైమ్‌లో విజయశాంతి సేవలు వినియోగించుకున్న కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేశారని.. దీంతో రాములమ్మ కూడా సైలెంట్ అయ్యారనే చర్చ జరుగుతోంది. ఐతే మళ్లీ ఆమె పేరు గాంధీభవన్‌లో రీసౌండ్ ఇస్తోంది.
విజయశాంతి పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు అని ఆరా..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్.. తన మార్క్ నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. పార్టీలో ఏం జరుగుతోంది.. ఎవరి పనితీరు ఏంటనే దానిపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఐతే రాములమ్మ గురించి కూడా మీనాక్షి ఆరా తీశారట. విజయశాంతి పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు.. ఎందుకు ఆమె పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం లేదని పార్టీ నేతలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది.
ఆ పనిని విజయశాంతి లాంటి వాళ్లు సమర్దవంతంగా చేయగలరనే భావన..
విజయశాంతి లాంటి సీనియర్ లీడర్స్‌ని.. పార్టీ సరిగా ఉపయోగించుకోవడం లేదన్న ఫీడ్ బ్యాక్ వచ్చిందట. రాములమ్మ లాంటి వారి నేతల సేవలు.. పార్టీకి అవసరమని మీనాక్షి నటరాజన్ ఓ అభిప్రాయానికి వచ్చారని టాక్.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రచారం కల్పించడం, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్స్ వేయడం లాంటివి.. విజయశాంతి లాంటి వాళ్లు సమర్దవంతంగా చేయగలరని మీనాక్షి భావిస్తున్నారట. దీంతో మళ్లీ పార్టీకి విజయశాంతిని దగ్గర చేసే చర్యలపై దృష్టి పెట్టారనే చర్చ జరుగుతోంది.
Also Read : ఏపీలో ఎమ్మెల్సీ హీట్.. నాగబాబుకు లైన్ క్లియర్.. టీడీపీకి మిగిలేవి ఎన్ని? బీజేపీ ట్విస్ట్ ఇస్తుందా..
ఎక్కడున్నా సరే టచ్‌లోకి వెళ్లాలని ఓ నేతకు ఆదేశం..
అసలు విజయశాంతి ఎక్కడున్నారని ఆరా తీసిన మీనాక్షి.. ఆమె ఎక్కడున్నా సరే టచ్‌లోకి వెళ్లాలని ఓ పార్టీ నేతను ఆదేశించినట్లు సమాచారం. త్వరలోనే విజయశాంతి నివాసానికి స్వయంగా వెళ్లి.. ఆమెతో మాట్లాడాలని డిసైడ్ అయ్యారట మీనాక్షి. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
మీనాక్షి వెళ్లి కలిసినా.. రాములమ్మ సానుకూలంగా రియాక్ట్ అవుతారా.. ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుందో రివీల్ చేస్తారా.. రాములమ్మ చెప్పబోయే విషయాలు పార్టీలో ఎవరినైనా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందా.. ఇలా రకరకాల ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయ్. ఏమైనా ఇన్నాళ్లకు మళ్లీ రాములమ్మ పేరు మళ్లీ తెరమీదకు రావడంతో.. కాంగ్రెస్‌లో కొత్త చర్చ మొదలైనట్లు కనిపిస్తోంది.