Goutham Reddy : ఫైబర్‌నెట్‌తో మారుమూల గ్రామాల్లోనూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అవకాశం-గౌతమ్‌ రెడ్డి

పెద్ద హీరోలకు, నిర్మాతలకు మేము (Goutham Reddy) వ్యతిరేకం కాదు. మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా రిలీజ్ రోజే సినిమా చూసే అవకాశం లభిస్తుంది.

Goutham Reddy (Photo : Press Release.. Jogi Naidu, Posani, Goutham Reddy, Ali, C Kalyan)

Goutham Reddy : సినిమా రిలీజ్ అయిన రోజు ఇంట్లోనే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసే ఛాన్స్‌ ఏపీ ఫైబర్‌ నెట్‌ కల్పిస్తోందని ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ గౌతమ్‌ రెడ్డి అన్నారు. సీఎం జగన్ ఆలోచన మేరకు “ప్రజల వద్దకు సినిమా” తీసుకొస్తున్నామన్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్నవారు కూడా రిలీజ్‌ రోజే సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్‌ ల్యాబ్‌లో మీడియాతో గౌతమ్‌ రెడ్డి మాట్లాడారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా నెట్ సేవలను ఏపీలో తక్కువ ధరకు అందిస్తున్నామన్నారు. పెద్ద హీరోలకు, నిర్మాతలకు మేము వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. సినిమాను బేస్ చేసుకుని ఫిఫ్టీ-ఫిఫ్టీ రేషియో ఉంటుందన్నారు. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ పల్లెటూర్లతో ఎక్కువ కనెక్ట్‌ అయిందని, దీనివల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా రిలీజ్ రోజు సినిమా చూసే అవకాశం లభిస్తుందన్నారు.

Also Read..Chor Nikal Ke Bhaga : అందులో RRR రికార్డ్ బద్దలుకొట్టిన బాలీవుడ్ సినిమా..

“ఏ రోజు సినిమా రిలీజ్ అవుతుందో.. అదే రోజు పల్లెటూరులో కూడా సినిమా చూడవచ్చనే కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది. చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమా కూడా ఫైబర్ నెట్‌లో రిలీజ్ అయితే ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది” అని ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి అన్నారు.(Goutham Reddy)

‘ఒక నిర్మాత కష్టపడి సినిమా తీస్తే అది రిలీజ్ రోజునే పైరసీ అయిపోతుంది. ఇండస్ట్రీలో ఉన్న మనం పైరసీని ఎందుకు అరికట్టలేకపోతున్నాము? పెద్దలందరూ కూడా దీనిపై పోరాడాలి. ఫైబర్ నెట్‌లో రిలీజ్ రోజున సినిమా చూడడం అనేది చిన్న సినిమాకు ఆక్సిజన్ లాంటిది. చిన్న నిర్మాతలు ఫైబర్ నెట్‌లో కచ్చితంగా రిలీజ్ చేస్తారు. పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తారని అనుకుంటున్నాను” అని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్, నటుడు అలీ అన్నారు.

Goutham Reddy (Photo : Press Release)

నిర్మాత సి.కళ్యాణ్ :
”ఏపీ ప్రభుత్వం నియమించిన పోసాని, అలీ, జోగినాయుడు వల్ల సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగుతోంది. ఫైబర్ నెట్‌లో సినిమా రిలీజ్ అనేది చిన్న నిర్మాతకు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన వరం. చిన్న సినిమాకు అసలు థియేటర్స్ ఇవ్వడం లేదు. జనాలు ఓటీటీకి అలవాటు పడ్డారు. ఈరోజు చిన్న నిర్మాతలకు పేదల పాలిట పెన్నిదే ఈ ప్లాట్‌ఫామ్‌. ఏపీ సీఎం జగన్ విజన్ చాలా పెద్దది. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి మంచి ఆలోచన చేశారు. చిన్న నిర్మాతలకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు సినీ ఇండస్ట్రీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం”.

Also Read..Pushpa 2 : అడవిలో పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం..

ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్ తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఎంతో కృషి చేస్తున్నారు అని ఏపీ కల్చరల్ కమిటీ క్రియేటివ్ హెడ్, ప్రముఖ నటుడు జోగినాయుడు అన్నారు. రిలీజ్ రోజే సినిమాలను ఫైబర్ నెట్ లో ప్రసారం చేసే ఈ విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని చిత్ర పరిశ్రమకు.. ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న “పదో రత్నం”గా పేర్కొన్నారు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ.