గ్రాండ్ వెల్ కం : సీఎం జగన్ కోసం మానవహారం

  • Publish Date - December 28, 2019 / 11:28 AM IST

విశాఖలో అడుగు పెట్టారు సీఎం జగన్. ఏపీలో అధికారంలోకి వచ్చాక…తొలిసారి..సాగర తీరానికి చేరుకున్న జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఘన స్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు, అభిమానులు. ఈ సందర్భంగా 24 కిలోమీటర్ల మేర ప్రజలు మానవహారంగా నిలబడడం అందర్నీ ఆకర్షించింది. జగన్ ప్లకార్డులు పట్టుకుని..ప్రజలు కేరింతలు, హర్షధ్వానాల మధ్య గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి కైలాసగిరి వరకు ఈ మానవహారం జరిగింది. సభలో గాయనీ, గాయకులు పాటలతో హుషారు రేకేత్తించారు.

ఈ సందర్భంగా జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. రెండు రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవ్‌కు సాగరతీరం వేదిక అయ్యింది. ఆర్కే బీచ్‌తో పాటు… వైఎస్సార్ సెంట్రల్ పార్క్‌లో అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా..విశాఖను అందంగా ముస్తాబు చేశారు. సాయంత్రం 6 గంటలకు సాంప్రదాయ నృత్యాలతో సీఎం జగన్‌కు పలికేలా భారీ కార్నివాల్ ఏర్పాటు చేయడం హైలెట్‌గా నిలుస్తోంది. 

విశాఖను కార్యనిర్వాహఖ రాజధానిగా ఏర్పాటు చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో సీఎం జగన్ ఇక్కడ పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ప్రసంగంలో రాజధాని విషయంపై ఏదైనా ప్రకటన చేస్తారా అనే ఉత్కంఠ అటు రాజధాని, ఇటు విశాఖ ప్రజల్లో నెలకొంది. 

* ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో ఏటా విశాఖ ఉత్సవ్‌ను నిర్వహిస్తుంటారు.
* సీఎం పర్యటన, విశాఖ ఉత్సవ్‌కు వచ్చే అతిధుల తాకిడి నేపథ్యంలో సాగరతీరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
* నవరత్నాలు కార్యక్రమాన్ని లేజర్ షో ద్వారా ప్రెజెంట్ చేస్తారు. 

* విశాఖ ఉత్సవ్‌లో సినీ తారలు సందడి చేయనున్నారు.
* మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ లైవ్ షో ఏర్పాటు చేశారు. 
* విశాఖ ఉత్సవ్-2019లో భాగంగా ఆర్టీసి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వీవీఎం ఆర్డీఏ సెంట్రల్ పార్కులో భారీ ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. 

Read More : న్యూఇయర్ వేడుకల్లో విషాదం : గోవాలో తెలుగు యువకులు మృతి