అనంతపురం జిల్లా రాయదుర్గంలో మిడతల కలకలం నెలకొంది. భారీ సంఖ్యలో మిడతలు వచ్చాయి. జిల్లేడు చెట్ల ఆకులు తినేయడంతో మిడతల దండు వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
మిడతల దండు ఒక్కసారిగా రాయదుర్గంపై దండెత్తడంతో ప్రజల్లో భయాందోళను గురవుతున్నారు. గంట ముందు రాయదుర్గం పట్టణానికి చేరుకున్న మిడతలు జిల్లేడు చెట్టుపై వాలి పది నిమిషాల్లో జిల్లేడు చెట్టు ఆకులను మొత్తం తినేయడంతో మిడతలు పంట పొలాల మీద కూడా వాలి పంటను నాశనం చేసే విధంగా ఉంది.
మిడత దండు వచ్చి పంటలను నాశనం చేయడం గతంలో టీవీల్లో చూశాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని, ఇంత భయకరంగా ఉంటుందని ఎప్పుడూ చూడలేదని రైతులు అంటున్నారు. పట్టణంలో ఉన్న మిడతల మొత్తం కొద్ది సేపట్లో పంట పొలాలపై వ్యాపించే విధంగా ఉంది. వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా ఒకేసారి రావడంతో ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు.
మిడతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తామని వ్యవసాయ అధికారులు రెండు రోజుల ముందు జిల్లా కలెక్టర్ సమావేశంలో చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆలస్యం చేశారని అనిపిస్తోంది. వ్యవసాయ అధికారులు రాయదుర్గం పట్టణానికి చేరుకోలేదు. పక్కనే ఉన్న గ్రామంలో ఉన్నారు.
పంటపొలాలపై వ్యాపించి చేతికొచ్చిన పంటలను నాశనం చేసి ఇప్పటికే కరోనా లాక్ డౌన్ తో నష్టపోయి ఉన్నారు. ముందుకే కరువు జిల్లా, ఇప్పుడు మిడతల దండుతో తీవ్రంగా నష్టపోతే రైతుల ఆత్మహత్యలు తప్ప మరోటి లేదు.
Read: బీ కేర్ ఫుల్ : తెలుగు రాష్ట్రాలకి మరో ముప్పు..మిడతలతో జాగ్రత్త