Andhra Pradesh: నాయుడుపేట గ్రీన్‌ఫీల్డ్ లామినేట్ ప్రాజెక్ట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్
డెకరేటివ్ సర్ఫేసింగ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉంటూ, సబ్‌స్ట్రేట్ విభాగంలోకి అడుగుపెట్టిన గ్రీన్‌లామ్ డెకరేటివ్ లామినేట్‌లు, కాంపాక్ట్ లామినేట్‌లు, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ క్లాడ్‌లు, డెకరేటివ్ వెనీర్లు, ఇంజినీరింగ్ చెక్క ఫ్లోర్లు, డోర్లు, రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్‌ల కోసం ప్లైవుడ్ వరకు విభిన్న ఉత్పత్తులను అందిస్తోంది

GreenLam Industries: ప్రపంచంలోని టాప్ 3 లామినేట్ తయారీదారులలో ఒకటైన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలోని తన అత్యాధునిక తయారీ కేంద్రంలో శుక్రవారం నుంచి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించినట్లు వెల్లడించింది. లామినేట్ యూనిట్ ఏర్పాటు దక్షిణ భారతదేశంలో తన తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు, నాణ్యమైన లామినేట్ షీట్లు మరియు కాంపాక్ట్ బోర్డ్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలలో కంపెనీ గణనీయమైన ముందడుగు వేసింది.
డెకరేటివ్ సర్ఫేసింగ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉంటూ, సబ్‌స్ట్రేట్ విభాగంలోకి అడుగుపెట్టిన గ్రీన్‌లామ్ డెకరేటివ్ లామినేట్‌లు, కాంపాక్ట్ లామినేట్‌లు, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ క్లాడ్‌లు, డెకరేటివ్ వెనీర్లు, ఇంజినీరింగ్ చెక్క ఫ్లోర్లు, డోర్లు, రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్‌ల కోసం ప్లైవుడ్ వరకు విభిన్న ఉత్పత్తులను అందిస్తోంది. తయారీలో నైపుణ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉపరితల పరిష్కారాలను అందించడంలో అగ్రగామిగా ఉండటంతో, ఈ కొత్త ప్రాజెక్ట్ గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ మార్కెట్ అవకాశాన్ని వేగవంతం చేస్తూ, దాని వృద్ధికి కొత్త ఆదాయ వనరులను అందిస్తుంది.
గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఈ తయారీ కేంద్రం, ఏడాదికి 3.50 మిలియన్ లామినేట్ షీట్‌లు, కాంపాక్ట్ బోర్డ్‌లతో ఆకట్టుకునే ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌గా నెలకొల్పారు. లామినేట్ పరిశ్రమలో శ్రేష్ఠత, ఆవిష్కరణలకు మరియు ప్రాంతం ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు, తన వినియోగదారులకు అత్యుత్తమ-నాణ్యత కలిగిన లామినేట్ ఉత్పత్తులను అందించేందుకు గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ నిబద్ధతకు ఈ తయారీ కేంద్రం ఏర్పాటు నిదర్శనంగా నిలుస్తుంది.