ITR Due Date Extension : టాక్స్ పేయర్లకు బిగ్ న్యూస్.. ఈ తేదీకి ముందే ITR ఫైలింగ్ చేసేయండి.. లేదంటే రూ. 5వేలు పెనాల్టీ తప్పదు..!

ITR Due Date Extension : ఐటీఆర్ గడువు తేదీ దగ్గరపడుతోంది. ఈ తేదీలోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం బెటర్.. రూ. 5వేల వరకు జరిమానా చెల్లించాలి.

ITR Due Date Extension : టాక్స్ పేయర్లకు బిగ్ న్యూస్.. ఈ తేదీకి ముందే ITR ఫైలింగ్ చేసేయండి.. లేదంటే రూ. 5వేలు పెనాల్టీ తప్పదు..!

ITR Due Date Extension

Updated On : September 13, 2025 / 1:33 PM IST

ITR Due Date Extension : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ఐటీఆర్ ఫైలింగ్ చేశారా? లేదంటే వెంటనే చేసేయండి. ఆలస్యమయ్యే కొద్ది అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ సకాలంలో చెల్లించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సరైన సమయంలో ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా భారీ పెనాల్టీలను తప్పించుకోవచ్చు.

2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు (ITR Due Date Extension) పన్ను రిటర్న్‌ల సమర్పణ గడువు తేదీని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) సడలించింది. పొడిగించిన తేదీకి ముందు ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు రూ. 5వేల వరకు జరిమానాలను నివారించవచ్చు.

ఐటీఆర్ ఫైలింగ్ చేయకపోతే మీ సేవింగ్స్, రీఫండ్స్, రుణ మంజూరుపై కూడా ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) గడువుకు ముందే ఫైలింగ్ చేయడం ఎంతైనా మంచిది. పన్ను చెల్లింపుదారులు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఐటీఆర్ గడువు తేదీని సవరించింది. వాస్తవానికి, ఐటీఆర్ ఫైలింగ్ జూలై 31, 2025 వరకు గడువు తేదీ ఉంది.

కానీ, ఆ తర్వాత సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఐటీఆర్ దాఖలుకు ఇంకా సమయం ఉంది. పన్ను చెల్లింపుదారులు ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. తద్వారా భారీ జరిమానాలు పడకుండా నివారించవచ్చు. చివరి నిమిషంలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గడువుకు ముందుగానే ఐటీఆర్ ఫైలింగ్ చేయాలి.

ఆదాయపు పన్ను రిటర్న్ ఏంటి? :
ఐటీఆర్ ఫైలింగ్ అనేది పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన మొత్తం ఆదాయాన్ని ఆదాయ శాఖకు చెప్పాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారమ్ ద్వారా మీ ఆదాయం, వర్తించే పన్ను వివరాలను దాఖలు చేయొచ్చు.

Read Also : Apple iPhone 17 Pre-orders : గెట్ రెడీ.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రీ-ఆర్డర్లు ఈరోజు నుంచే.. ధర, ఆఫర్లు ఇవే.. ఇండియాలో ఎక్కడ కొనాలి?

ఆదాయపు పన్ను రిటర్నులు గడువు తేదీకి ముందే దాఖలు చేయాలి. ఐటీఆర్ అంటే ఆదాయపు పన్ను రిటర్న్. అంటే ఇదో నిర్ణీత ఫారమ్. ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయం, ఆ ఆదాయంపై చెల్లించే పన్నుల వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. అంతేకాదు.. ఏదైనా ఆర్థికపరమైన నష్టాలను క్యారీ-ఫార్వర్డ్, క్లెయిమ్ రీఫండ్‌ చేసుకోవచ్చు.

ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు :

కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఐటీఆర్ దాఖలు గడువు తేదీని జూలై 31, 2025 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలుకు కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ, ఈ గడువు తేదీ దాటితే భారీ మొత్తంలో మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

గడువు తేదీ దాటితే పెనాల్టీ :
సెక్షన్ 234F, సెక్షన్ 139(1) కింద పేర్కొన్న గడువు తేదీ దాటాక రిటర్న్ దాఖలు చేస్తే.. రూ. 5వేలు ఆలస్య దాఖలు రుసుము చెల్లించాలి. అయితే, వ్యక్తి మొత్తం ఆదాయం రూ. 5 లక్షలు మించకపోతే ఆలస్య దాఖలు రుసుము రూ. 1000 చెల్లించాలి.

రూ. 5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు రూ. 5వేలు ఆలస్య రుసుము , రూ. 5 లక్షల లోపు ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారులకు రూ. 1000 జరిమానా, సెక్షన్లు 234A, 234B, 234C కింద అదనపు వడ్డీ కూడా వర్తించవచ్చు.