Apple iPhone 17 Pre-orders : గెట్ రెడీ.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రీ-ఆర్డర్లు ఈరోజు నుంచే.. ధర, ఆఫర్లు ఇవే.. ఇండియాలో ఎక్కడ కొనాలి?
Apple iPhone 17 Pre-orders : మీరు లేటెస్ట్ ఐఫోన్ బుకింగ్ కోసం మీకు ఇష్టమైన వేరియంట్‌ను ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు.

Apple iPhone 17 Pre-orders
Apple iPhone 17 Pre-orders : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ భారతీయ యూజర్ల కోసం ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 12 సాయంత్రం 5:30 గంటలకు అధికారికంగా ప్రీ-ఆర్డర్‌లను ప్రారంభించనుంది.
ఈ లైనప్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, సరికొత్త ఐఫోన్ ఎయిర్ మోడల్స్ ఉన్నాయి. కస్టమర్లు ఆపిల్ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ స్టోర్‌లు, ప్రముఖ రిటైలర్ల ద్వారా తమ ఐఫోన్లను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ, ట్రేడ్-ఇన్ బెనిఫిట్స్ పొందవచ్చు.
భారత్‌లో ఐఫోన్ 17 ప్రీ-ఆర్డర్లు ప్రారంభం :
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ప్రీ-ఆర్డర్‌లను ఈరోజు (సెప్టెంబర్ 12) నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల వినియోగదారులు తమ బుకింగ్‌లను ఈ కింది విధంగా బుక్ చేసుకోవచ్చు.
- ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్, ఆపిల్ ప్రీమియం రీసేలర్లు :
- రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ స్టోర్లు
- అమెజాన్ (‘Notify Me’ నోటిఫికేషన్)
- ఫ్లిప్‌కార్ట్ (‘కమింగ్ సూన్’)
- డెలివరీలు సెప్టెంబర్ 19 (2025) నుంచి ప్రారంభం
ప్రీ-ఆర్డర్ ఆఫర్లు, బెనిపిట్స్ :
- భారతీయ కొనుగోలుదారుల కోసం ఆపిల్ అనేక స్పెషల్ ప్రీ-ఆర్డర్ డీల్స్ అందిస్తోంది.
- యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులపై రూ. 5,000 క్యాష్‌బ్యాక్
- 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు,
- ఇన్ స్టంట్ సేవింగ్ కోసం పాత ఫోన్ ఎక్స్చేంజ్, ఆపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్
- 3 నెలల పాటు ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ టీవీ ప్లస్, ఆపిల్ అర్కేడ్ ఫ్రీ ట్రయల్
ఐఫోన్ 17 సిరీస్ : భారత్ ధర ఎంతంటే? :
- అన్ని మోడళ్లలో అధికారిక ధరలు ఇలా ఉన్నాయి.
- ఐఫోన్ 17 : రూ. 82,900 (256GB), రూ. 1,02,900 (512GB)
- ఐఫోన్ ఎయిర్ : రూ.1,19,900 (256GB), రూ.1,39,900 (512GB), రూ.1,59,900 (1TB)
- ఐఫోన్ 17 ప్రో : రూ. 1,34,900 (256GB), రూ. 1,54,900 (512GB), రూ. 1,74,900 (1TB)
- ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ : రూ.1,49,900 (256GB), రూ.1,69,900 (512GB), రూ.1,89,900 (1TB), రూ.2,29,900 (2TB)
ఐఫోన్ 17 సిరీస్ : కీలక ఫీచర్లు
- 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, ప్రోమోషన్ 120Hz
- A19 చిప్ ద్వారా పవర్ పొందుతుంది.
- 30 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్
- డ్యూయల్ 48MP ఫ్యూజన్ కెమెరాలు
- కలర్ ఆప్షన్లు : బ్లాక్, వైట్, మిస్ట్ బ్లూ, సేజ్, లావెండర్
ఐఫోన్ ఎయిర్ :
- అత్యంత సన్నని ఐఫోన్ 5.64mm మందం
- 6.5-అంగుళాల XDR డిస్‌ప్లే, A19 ప్రో చిప్
- సింగిల్ కెమెరా, 48MP కెమెరా, 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్
- కలర్ ఆప్షన్లు : స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్, స్కై బ్లూ
ఐఫోన్ 17 ప్రో :
- టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ 48MP ఫ్యూజన్ కెమెరాలు
- A19 ప్రో చిప్, 31 గంటల వీడియో ప్లేబ్యాక్
- కలర్ ఆప్షన్లు : సిల్వర్, కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ
ఐఫోన్ 17 ప్రో మాక్స్ :
- 6.9-అంగుళాల XDR డిస్‌ప్లే
- అతిపెద్ద బ్యాటరీ, 37 గంటల వీడియో ప్లేబ్యాక్
- 2TB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీ
- కలర్ ఆప్షన్లు : సిల్వర్, కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ కొత్త డిజైన్ ఆప్షన్లు, పవర్‌ఫుల్ A19 ప్రాసెసర్లు, అద్భుతమైన డిస్‌ప్లే అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. ఐఫోన్ 17 సిరీస్ ప్రీ-ఆర్డర్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. భారతీయ కొనుగోలుదారులు అప్‌గ్రేడ్ కోసం ప్రత్యేకమైన ఆఫర్‌లు, ఈఎంఐ ఆప్షన్లు, క్యాష్‌బ్యాక్ డీల్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఆపిల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ సొంతం చేసుకోవాలంటే స్టాక్‌లు అయిపోకముందే ఐఫోన్ 17ను బుక్ చేసుకోండి.