Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ BBD సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 14, ఐఫోన్ 16 ప్రోపై కిర్రాక్ డిస్కౌంట్లు.. ఈ డీల్స్ మిస్ చేయొద్దు..!

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ మొదలు కానుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 15, ఐఫోన్16, ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు.

1/6Flipkart Big Billion Days Sale Deals
Flipkart Big Billion Days Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వార్షిక బిగ్ బిలియన్ డేస్ సేల్‌ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభించనుంది. ఈ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 9, ఐఫోన్ 14, ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రోతో సహా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
2/6Flipkart Big Billion Days Sale Deals
ఈ ప్లాట్‌ఫామ్ బ్లాక్, ప్లస్ సభ్యులకు 24 గంటల ముందస్తు యాక్సెస్ విండో అందిస్తుంది. గూగుల్ పిక్సెల్ 9 రూ.34,999పై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చునని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. కంపెనీ ఇప్పుడు ఆపిల్ ఐఫోన్‌లపై కూడా అద్భుతమైన డీల్స్ ప్రకటించింది.
3/6Flipkart Big Billion Days Sale Deals
ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ డీల్స్ : ఈ సేల్ సమయంలో ఐఫోన్ 14 మోడల్ రూ.41,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు రూ.2,000 క్రెడిట్ కార్డ్ ఆఫర్‌ను పొందవచ్చు. దాంతో ఈ ఐఫోన్ కొనుగోలుపై రూ.39,999 తగ్గింపు పొందవచ్చు.
4/6iPhone 14
ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ అధికారిక సైట్‌లో ఐఫోన్ 16 రూ.69,900 ధరకు అందుబాటులో ఉండగా ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా భారీగా తగ్గించింది. ఈ సేల్ సమయంలో ఈ-కామర్స్ దిగ్గజం ఐఫోన్ 16 మోడల్ రూ.51,999కి అందిస్తుంది.
5/6iPhone 16 Pro
ఐఫోన్ 16 ప్రో మోడల్స్ కూడా తగ్గనున్నాయి. ఐఫోన్ 16 ప్రో రూ.69,999కు అందుబాటులో ఉంటుంది. ఈ ధరలో క్రెడిట్ కార్డ్ ఆఫర్‌తో పాటు రూ.5,000 తగ్గింపు కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ 16 ప్రో మాక్స్ కూడా భారీ ధర తగ్గింపును పొందనుంది. రూ.89,999కి కొనుగోలు చేయొచ్చు. క్రెడిట్ కార్డ్‌తో రూ.5వేలు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
6/6iPhone 16 Pro
ఈ సేల్ సమయంలో పిక్సెల్ 9 ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.37,999 వద్ద లిస్ట్ అయింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ICICI, Axis బ్యాంక్ కార్డులతో రూ.2వేలు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. కంపెనీ ఎక్స్ఛేంజ్‌పై అదనంగా రూ.1,000 తగ్గింపు అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.34,999కి తగ్గుతుంది.