Bigg Boss Today Promo : అపూర్వను ఎలిమినేట్ చేసిన కంటెస్టెంట్స్.. దోమలా నరేశ్ కామెడీ అదుర్స్..
ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో (Bigg Boss Today Promo ) వచ్చేసింది.
Bigg Boss Season 10 Telugu Day 33 Promo 1
Bigg Boss Today Promo : త్రిగుణ్ అమన్ టాస్కులు బాగా ఆడి సేమ్ అయిన సంగతి తెలిసింది. ప్రస్తుతం లీడర్ బోర్డులో నరేష్, రామ్‌ప్రసాద్ టీమ్ 220, చరణ్, అపూర్వ టీమ్ 200, ముకేశ్ ఝాన్సీ 160, షాలినీ, రోహిత్ 140 మార్కులతో ఉన్నారు. ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్ అనే టాస్కును ఇచ్చాడు బిగ్‌బాస్.
ప్లిప్ చేసినప్పుడు దానిలో ఏం రాసి ఉంటే అది చేయాల్సి ఉంటుంది. మొదటగా ముకేశ్ ప్లిప్ చేయగా.. ఐదు వియర్డ్ పేస్లు పెట్టాలని రాసి ఉంది. దీంతో ముకేష్ ఐదు రకాలుగా వియర్డ్‌గా నటిస్తున్నాడు. ఇక అపూర్వ పిప్ల్ చేయగా.. కంటెస్టెంట్లు అందరు కలిసి ఒకరిని బయటకు పంపించాలని వస్తుంది. దీంతో అందరూ ఓట్లు వేసుకుని అపూర్వనే పంపిస్తారు.
Viraajita : పొట్టి స్కర్ట్‌లో యూట్యూబర్ విరాజిత.. ఫోటోలు వైరల్..
నరేశ్ ప్లిప్ చేయగా.. డైస్ రోల్ చేసినప్పుడు హయ్యస్ట్ నంబర్ వచ్చిన వాళ్లని ఎలిమినేట్ చేయాలని వస్తుంది. దీంతో అందరూ డైస్ రోల్ చేయగా.. షాలినీకి హయ్యస్ట్ నంబర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దోమలా నటించాలని ముకేశ్ రాగా.. దేబ్జానీ దగ్గరి వెళ్లి బ్లడ్ స్మెల్ కంటే బటర్ స్మెల్ వస్తుంది? అని నవ్వించే ప్రయత్నం చేస్తాడు. ఆ తరువాత షాలిని వద్దకు వెళ్తాడు. ఈ దోమ ఏంటి.. మీద వాలి ఏం చేయడం లేదని అనగా.. పక్కనే డేంజర్(రోహిత్) ఉందని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ముకేశ్. ఆ తరువాత వర్షినితో ప్లట్టింగ్ చేశాడు.
ఇంతలో బిగ్‌బాస్ మాట్లాడుతూ.. నరేశ్ మీరే దోమ అయితే ఏం చేస్తారు అని ప్రశ్నించాడు. ఈ క్రమంలో నరేశ్ చేసే కామెడీకి అందరూ నవ్వుకుంటారు.
