2 కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జగన్ వైజాగ్ వస్తున్నారు: పూర్తి వివరాలు తెలిపిన మంత్రి గుడివాడ

Gudivada Amarnath: విశాఖను ఒక గ్లోబుల్ సిటీగా మర్చలనేది సీఎం ఆలోచన అని గుడివాడ అమర్నాథ్ చెప్పారు.

Andhra Pradesh Minister Gudivada

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వైజాగ్‌లో పర్యటిస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మంగళవారం జగన్ విశాఖలో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో విశాఖలో అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… విజన్ వైజాగ్ పేరుతో సీఎం జగన్ పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారని చెప్పారు. ఇందులో వివిధ రంగాలకు 2,000 మంది ప్రముఖులు హాజరవుతారని అన్నారు.

విశాఖను ఒక గ్లోబుల్ సిటీగా మర్చలనేది సీఎం ఆలోచన అని గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈస్ట్ కోస్ట్‌కు గేట్ వేగా వైజాగ్ను చూడాలనేది సీఎం ఉద్దేశమని తెలిపారు. విశాఖ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని విజన్ విశాఖ పేరుతో ప్రసంగిస్తారని చెప్పారు.

విశాఖ అభివృద్ధికి సంబంధించి విజన్ విశాఖ డాక్యుమెంట్ విడుదల చేస్తారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రూ.1,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. 100 కోట్ల రూపాయలతో నిర్మించే నూతన జీవీఎంసీ భవన్ కు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.

జగన్ 7 కోట్ల రూపాయల వ్యయమయ్యే స్కిల్ సెంటర్స్ కు శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. 7వ తేదీన అనకాపల్లిలో ఆసరా 4 విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. సచివాలయం తాకట్టు అనేది అవాస్తవమని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయబోయే నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేసీఆర్

ట్రెండింగ్ వార్తలు