Gudivada Casino Issue Ysrcp And Tdp Workers Gathering In Gudivada Casino Issue
Gudivada Casino Issue : కృష్ణా జిల్లా ‘గుడివాడ క్యాసినో’ వ్యవహారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొడాలి కన్వెన్షన్ సెంటర్‌కు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. క్యాసినో నిర్వహణకు సంబంధించి పరిశీలించేందుకు గుడివాడలో శుక్రవారం టీడీపీ నిజానిర్ధారణ కమిటీ బృందం పర్యటించనుంది. క్యాసినో నిర్వహణపై ఎన్టీఆర్ భవన్ నుంచి గుడివాడకు టీడీపీ నిజానిర్ధారణ కమిటీ సభ్యులు బయల్దేరనున్నారు.
ఎన్టీఆర్ భవన్‌కు నిజానిర్ధారణ కమిటీ సభ్యులు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య చేరుకుంటున్నారు. టీడీపీ బృందాన్ని అడ్డుకుని తీరుతామని గుడివాడ వైసీపీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గుడివాడ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ నేతల గుడివాడ పర్యటన నేపథ్యంలో అక్కడ శాంతిభద్రతల సమస్యలు వస్తాయోనని పోలీసుల్లో టెన్షన్‌లో మొదలైంది. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్, నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి కొడాలి నాని అమరావతి బయల్దేరారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలను టీడీపీ, వైసీపీ నేతలు సమీకరించే పనిలో పడ్డారు. గుడివాడ పట్టణం వ్యాప్తంగా ప్రత్యేక భద్రతా చర్యలను డీఎస్పీ సత్యానందం తీసుకుంటున్నారు.
గుడివాడలో పర్యటించి పూర్తి స్థాయి నివేదికను టీడీపీ అధిష్టానానికి ఇచ్చేందుకు కమిటీ సభ్యులు సన్నద్ధమవుతున్నారు. గుడివాడకి ఉన్న మంచిపేరును నాశనం చేస్తున్నారని టీడీపీ మండిపడుతోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహనీయులు పుట్టిన గడ్డపై గోవా కల్చర్ ఏంటని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.
Read Also : TDP Gudivada Tour : గుడివాడకు టీడీపీ నిజనిర్దారణ కమిటీ బృందం.. సర్వత్రా ఉత్కంఠ!