Elderly Couple Travel Dwarka To Tirumala : వెంకన్న మొక్కు..గుజరాత్‌లోని ద్వారక నుంచి తిరుమలకు వృద్ధ దంపతుల పాదయాత్ర

గుజరాత్ కు చెందిన ఓ వృద్ధ జంట తిరుమ శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కు చెల్లించుకోవటానికి నాలుగున్నర నెలలుగా నడుస్తూనే ఉంది. తిరుమలలో ఏడుకొండలపై కొలువైన కలియుయుగ దైవం అయిన శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందుకు గుజరాత్ లోని ద్వారక నుంచి తిరుమలకు పయనమయ్యారు.

Elderly Couple Travel On foot from Dwarka to Tirumala

Elderly Couple Travel On foot from Dwarka to Tirumala  : గుజరాత్ కు చెందిన ఓ వృద్ధ జంట తిరుమలో కొలువైన శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కు చెల్లించుకోవటానికి నాలుగున్నర నెలలుగా నడుస్తూనే ఉంది. తిరుమలలో ఏడుకొండలపై కొలువైన కలియుయుగ దైవం అయిన శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందుకు స్వగ్రామం నుంచి కాలినడకన నడక మొదలు పెట్టారు. ఇప్పటికే వేల కిలోమీటర్లు నడుస్తూ తెలంగాణకు చేరుకున్నారు. ఇక ఏపీలోని చిత్తూరు జిల్లాలోని తిరుమలకు చేరుకోవాలి. ఏడు కొండలు ఎక్కాలి. ఆ కలియుగ దైవాన్ని కళ్లారా వీక్షించాలి. తమ మొక్కు చెల్లించుకోవాలి. ఈ సంకల్పంతో నెలల తరబడి నడుస్తూనే ఉన్నారా ద్వారకకు చెందిన హర్దేవ్‌ ఉపాధ్యాయ, సరోజ దంపతులు.

నాలుగు నెలల క్రితం ట్రాలీ బండిలో బట్టలు, మందులు, వంట సామాగ్రి వంటివి సర్ధుకున్నారు.బండిని తోసుకుంటూ ద్వారక నుంచి తిరుమలకు బయలుదేరారు. అలా నాలుగు నెలలుగా నడస్తూ తెలంగాణలోని సంగారెడ్డి చేరుకున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చి నాలుగైదు నెలలవుతున్నాయని, రోజుకు 20-30 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నామని హర్దేవ్‌ ఉపాధ్యాయ దంపతులు తెలిపారు. తాము అనారోగ్యానికి గురైన సమయంలో తిరుమల స్వామికి మొక్కుకున్నామని, ఆ మొక్కు చెల్లించుకునేందుకు ద్వారకా నుంచి తిరుమలకు కాలినడకన యాత్ర చేపట్టామని చెప్పుకొచ్చారు.

హర్దేవ్‌కు గుండె సంబంధిత సమస్యలు రావడంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో ఆయన తన ఆరోగ్యం బాగుపడితే, మళ్లీ మునుపటిలా మారితే సతీసమేతంగా తిరుమలకు కాలినడకన వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. దీంతో మొక్కు చెల్లించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దుస్తులు, మందులు, వంటసామగ్రి వంటి వస్తువులను ట్రాలీ బండిలో వేసుకొని తోసుకుంటూ ద్వారక నుంచి తిరుమలకు నాలుగు నెలల క్రితం పయనమయ్యారు. మార్గమధ్యంలో వారు సంగారెడ్డి చేరుకున్నారు. తాము ఇంటి నుంచి బయలుదేరి నాలుగున్నర నెలలు అవుతోందని, రోజుకు 20-30 కి.మీ నడుస్తున్నామని ఆ దంపతులు తెలిపారు. రాత్రి వేళల్లో ఆలయాల్లో పడుకుని మరుసటి రోజు నిద్ర లేచి కాలినడకన వెళ్తున్నామని వెల్లడించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నాక రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లామని..అనంతరం ఇంటికి వెళ్తామని చెబుతున్నారు.