Gummanur Jayaram : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చాకే.. వాల్మీకులకు స్వతంత్రం కల్పించి పదవులు ఇచ్చారని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. వాల్మీకులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రేమ, అభిమానం ఉందన్నారు. వాల్మీకులకు.. ఒక మంత్రి, రెండు ఎమ్మెల్సీ పదవులు కల్పించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కితాబిచ్చారు. కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలులో ఈ వ్యాఖ్యలు చేశారు.
” 70 ఏళ్లుగా ఏ రాజకీయ పార్టీ కూడా వాల్మీకులను గుర్తించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక వాల్మీకులకు స్వతంత్రం కల్పించి పదవులు ఇచ్చారు. వాల్మీకులకు ఎప్పుడూ వైఎస్ఆర్ కుటుంబం అండగా నిలుస్తుంది. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టినందుకు కొందరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.(Gummanur Jayaram)
వాల్మీకులకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క మగాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోవాల్మీకులకు ఒక్క పదవి ఇవ్వకుండా విస్మరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజకీయంగా పెద్ద పీట వేసి రాజకీయ పదవులు కల్పించారు. రాష్ట్రంలో వాల్మీకులు 40లక్షల మంది ఉన్నారు.
Also Read..Chandrababu Naidu : ఎన్నికలు రేపు పెట్టినా సిద్ధం, జగన్‌ని ఇంటికి పంపడం ఖాయం-చంద్రబాబు
వీరు అందరూ బాగుండాలంటే మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని భూస్థాపితం చేద్దాం. 2024 ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం” అని వాల్మీకులకు పిలుపునిచ్చారు మంత్రి గుమ్మనూరు జయరాం.
మరోవైపు కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు లేవన్నారు మంత్రి జయరాం. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై వాల్మీకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా మంత్రి జయరాం ఆధ్వర్యంలో కర్నూలులో వాల్మీకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక, ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదన్నారు మంత్రి జయరాం. 98శాతం ఇచ్చిన హామీలను జగన్ అమలు చేశారని, ఇంకా 2శాతం ప్రజలకు సేవ చేయాల్సి ఉందని మంత్రి జయరాం చెప్పారు.