Manda Krishna Madiga: ఉండవల్లి శ్రీదేవికి అండగా నిలిచిన కృష్ణ మాదిగ.. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్

ఉండవల్లి శ్రీదేవికి తాము అండగా ఉంటామని మంద కృష్ణ మాదిగ భరోసా ఇచ్చారు. శృతి మించితే ప్రతిఘటన తప్పదని వైసీపీ నాయకులను హెచ్చరించారు.

Manda Krishna Madiga: ఉండవల్లి శ్రీదేవికి అండగా నిలిచిన కృష్ణ మాదిగ.. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్

Manda Krishna Madiga: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి MRPS నాయకుడు మంద కృష్ణ మాదిగ మద్దతు ప్రకటించారు. గుంటూరు జిల్లాలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఉండవల్లి శ్రీదేవి(Undavalli Sridevi)కి తాము అండగా ఉంటామని.. ఆమెపై వైసీపీ శృతి మించి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

‘టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యే లను జగన్ రెడ్డి తీసుకున్నాడు. నీపై వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యే టీడీపీకి ఓటు వేస్తే తప్పేంటి. ఉండవల్లి శ్రీదేవిపై దాడి ఆపకపోతే మాదిగల ప్రతిఘటన ఉంటుంది. మాదిగల రాజకీయ ప్రతిఘటన ఎదుర్కొకోక తప్పద’ని కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంతో వైసీపీ అధిష్టానం ఉండవల్లి శ్రీదేవితో పాటు నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

MRPS ఉద్యమ సమయంలో నమోదైన కేసులు ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘మా హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. శాంతియుతంగా ధర్నాలు, నిరసనలు చేసినప్పుడు కేసులు నమోదు చేశారు. మేం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదు. తుని రైలు విధ్వంస ఘటన. కోనసీమ విధ్వంసం(konaseema riots) కేసులు రద్దు చేసారు. కాపులకు భయపడి జగన్ రెడ్డి రెండు సార్లు కేసులు ఎత్తి వేశారు.

Also Read: అమరావతిలో బీజేపీ నాయకులపై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్

మాదిగలు అంటే జగన్ రెడ్డికి చులకన. గాంధేయ మార్గంలో పోరాటం చేస్తే కేసులు నమోదు చేశారు. గోదావరి జిల్లాలో దళితులను హత్యలు, శిరోముండనాలు చేశారు. కాపు ప్రజా ప్రతినిధులు జగన్ రెడ్డిని శాసించి కేసులు రద్దు చేయించుకున్నారు. వైసీపీలోని దళిత ప్రజా ప్రతినిధులు జగన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు. మాదిగల ఆగ్రహానికి జగన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పద’ని కృష్ణ మాదిగ అన్నారు.