అనుమతులు లేకున్నా కోవిడ్ వైద్యం..ఒక్కో పేషెంట్ నుంచి రూ.14 లక్షలు వసూలు.. ఏలూరు మురళీకృష్ణ ఆస్పత్రి ఆగడాలు

  • Publish Date - August 22, 2020 / 06:20 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని మురళీకృష్ణ ఆస్పత్రి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ హాస్పిటల్ కు ఎలాంటి అనుమతులు లేకున్నా మురళీకృష్ణ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం కరోనా వైద్యం అందిస్తామంటూ లక్షలను దండుకుంటోంది. ఆస్పత్రికి కోవిడ్ సెంటర్ గా గుర్తింపు లేదని జిల్లా వైద్యాధికారులు అంటున్నారు.

మరోవైపు 45 రోజులుగా మురళీకృష్ణ ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ పేషంట్లకు వైద్యాన్ని అందిస్తోంది. కరోనా ట్రీట్ మెంట్ కోసం ఒక పేషంట్ నుంచి 14 లక్షల రూపాయలను వసూలు చేసింది. అలాగే మరో పేషెంట్ అడ్మిట్ అవడానికి లక్షన్నర కట్టించుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు 18 మందికి కరోనా వైద్యం అందించినట్లు గుర్తించిన అధికారులు.. కరోనా పేషంట్లను ఏలూరు కోవిడ్ హాస్పిటల్ కు తరలించారు. కరోనా పేషంట్ల దగ్గర లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదు రావడంతో మురళీకృష్ణ హాస్పిటల్ ను అధికారులు సీజ్ చేశారు. హాస్పిటల్ లో పరిశుభ్రత, మెడిసిన్స్ ను పరిశీలించారు.

45 రోజుల నుండి కూడా మురళీకృష్ణ హాస్పిటల్ లో కోవిడ్ కు సంబంధించిన ట్రీట్ మెంట్ కొనసాగుతుంది. అనేక మంది పేషంట్లను ప్రభుత్వానికి సంబంధించిన అంబులెన్సుల్లోనే ఇక్కడి తీసుకొచ్చి ట్రీట్ మెంట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికితోడు ఈ హాస్పిటల్ లో కరోనాతో మృతి చెందిన వాళ్లను కూడా ప్రభుత్వానికి సంబంధించిన అంబులెన్సుల్లోనే ఖననం చేయడానికి తీసుకెళ్తున్నారు.

45 రోజులుగా ఇక్కడ కరోనా ట్రీట్ మెంట్ చేస్తున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోలేదని, ఎందుకు చర్యలు తీసుకోలేదని మాత్రం ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతుంది. అయితే నిన్న అందినటువంటి సమాచారంతో డీఎమ్ హెచ్ఓ అర్ధరాత్రి ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు దాదాపుగా 10 లక్షలు రూపాయల విలువైన కరోనాకు సంబంధించిన ప్రభుత్వ మెడిసిన్ ను ఈ హాస్పిటల్ లో గుర్తించారో ఆ మెడిసిన్ ను సీజ్ చేశారు.

అదే విధంగా హాస్పిటల్ ను కూడా సీజ్ చేశారు. ఇప్పటివరకు ఎంతమంది కరోనా పేషంట్లకు ట్రీట్ మెంట్ చేశారు? ఎంత వసూలు చేశారనేదిపై ఎంక్వరీ చేస్తున్నారు. బాధితుల నుంచి పోలీసు, రెవెన్యూ అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

అలా అడిగి తెలుసుకుంటున్న వారిలో మొదటి వ్యకి అత్తగారిని రూ.2 లక్షల 30 వేలు చెల్లించారు. అలా ఫ్యామిలీ మెత్తానికి రూ.14 లక్షలు చెల్లించారు. ఐసీయూలో ఉన్న పేషెంట్ కు అడ్మిట్ చేసుకోవడానికి లక్షన్నర తీసుకున్నట్లు తెలుస్తోంది.