Vallabhaneni Vamsi Bail Petition : వల్లభనేని వంశీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వంశీని 10 రోజుల కస్టడీకి కోరారు పోలీసులు.
ఇటు బెయిల్ పిటిషన్ తో పాటు తనకు వెన్ను నొప్పి ఉందని, జైల్లో బెడ్ తో పాటు ఇంటి భోజనాన్ని అనుమతించాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. వీటిని విచారణకు స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయాలని సూచించింది.
సత్యవర్ధన్ రాజు కిడ్నాప్ కేసుకు సంబంధించి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు ఒక పిటిషన్ వేశారు. వంశీకి సంబంధించిన న్యాయవాది రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వంశీకి, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని.. వంశీకి బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్ వేశారు.
Also Read : అమితాబ్ బచ్చన్ అల్లుడి మీద చీటింగ్ కేసు..
ఇది కక్ష సాధింపు చర్య అని, రాజకీయ నాయకుల మాటలు విని పోలీసులు కేసు పెట్టారని చెప్పారు. స్వచ్చందంగానే సత్యవర్దన్ రాజు గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసుని విత్ డ్రా చేసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సత్యవర్ధన్ ను తాను ఎందుకు కిడ్నాప్ చేస్తానని పిటిషన్ లో పేర్కొన్నారు. జైల్లో ఆహారం సరిగా లేదని, దీని వల్ల అనారోగ్యంగా ఉన్న వంశీ మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, అందుకే ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
అలాగే తాను వెన్ను నొప్పితో బాధపడుతున్నానని, కింద పడుకుంటే ఇబ్బందిగా ఉందని, జైల్లో నాకు మంచం ఏర్పాటు చేసే విధంగా జైలర్ కి ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్ లో కోరారు వంశీ. అయితే, వంశీ ఆరోగ్యంగానే ఉన్నారని, డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారని, మంచం ఇవ్వడం కుదరదని జైలర్ చెప్పడం జరిగిందన్నారు.
Also Read : రాజకీయాల్లోకి రీఎంట్రీ వార్తలపై స్పందించిన కేశినేని నాని.. కీలక ప్రకటన
కాగా, స్పెషల్ గా మంచం అరెంజ్ చేయాలంటే కోర్టు నుంచి ప్రత్యేక ఆదేశాలు రావాలని, అప్పుడే మేము చర్యలు చేపడతామని జైలర్ చెప్పడంతో.. వంశీ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లను ఇవాళ న్యాయమూర్తి ముందు ఉంచారు. న్యాయమూర్తి వాటిని పరిశీలించిన తర్వాత.. విచారణ రేపటికి వాయిదా వేశారు.
కాగా, కౌంటర్ దాఖలు చేయాలని వంశీకి సంబంధించిన న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇరు పక్షాలకు కోర్టు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. నోటీసులు అందుకున్న తర్వాత వంశీ న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ వేయాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కౌంటర్లు దాఖలు చేసిన తర్వాతే ఈ పిటిషన్లపై వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది.