Nellore : వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు-చెన్నైకి తరలింపు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. ఈరోజు ఆయన ఆమంచర్ల గ్రామంలో పర్యటించారు.

Nellore  : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. ఈరోజు ఆయన ఆమంచర్ల గ్రామంలో పర్యటించారు. పర్యటన సమయంలోనే గుండె నొప్పి గా ఉండటంతో పలుమార్లు విశ్రాంతి తీసుకున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఈ మధ్యాహ్నానికి గుండె నొప్పి ఎక్కువగా రావటంతో ఆయన్నునెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

డాక్టర్లు ఆయన్ను పరీక్షించి ప్రాణ భయంలేదని తెలిపారు.  మెరుగైన  వైద్యం కోసం ఆయన్ను మరి కొద్దిసేపట్లో  చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.  శ్రీధర్ రెడ్డి కిగుండె పోటు వచ్చిందని తెలుసుకున్న వ్యవసాయ శాఖమంత్రి  కాకాణి గోవర్దనరెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్ళి కోటంరెడ్డి  ఆరోగ్య పరిస్ధితి పై ఆరాతీసి ఆయన్ను పరామర్శించారు.

గనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట” లో భాగంగా ఆయన గత47 రోజులుగా గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నేడు ఆమంచర్ల లోని గోటువారికండ్రిగ, మన్నవరప్పాడు లో పర్యటించారు.    ఆ సమయంలో అస్వస్ధతకు గురై వెంటనే ఇంటికి తిరిగ వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకుప్రాధమిక చికిత్స అందించారు. ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం లేదని చికిత్స అందించిన తర్వాత ఆరోగ్యం మెరుగు పడిందని అపోలోకు చెందిన డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. ఆయన సాధారణ స్ధితికి వచ్చిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆధునిక వైద్యపరికరాలు ఉన్న అంబులెన్స్ లో చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. రెండు వారాల క్రితం కూడా కోటంరెడ్డిశ్రీధర్ రెడ్డి అస్వస్ధతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు