కృష్ణానదికి భారీగా పోటెత్తుతున్న వరద.. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ పిల్లర్

ప్రకాశం బ్యారేజ్ దిగువన రిటైనింగ్ వాల్ పైవరకు వరద నీరు చేరింది. ఈ క్రమంలో బ్యారేజ్ ఫిల్టర్ దెబ్బతింది.

Prakasam Barrage

Prakasam Barrage : ఏపీలో కురుస్తున్న భారీ వర్షానికి కృష్ణానదిలో వరద నీరు పోటెత్తోంది. ప్రస్తుతం 11లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతోంది. గంటగంటకు రికార్డు స్థాయిలో వరద తీవ్రత పెరుగుతుంది. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజ్ దిగువన రిటైనింగ్ వాల్ పైవరకు వరద నీరు చేరింది. ఈ క్రమంలో బ్యారేజ్ ఫిల్టర్ దెబ్బతింది. ఇసుక బోటు వచ్చి తగలడంతో బ్యారేజ్ 69వ పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది. గేటు లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజీ అయింది. మరికొన్ని రోజులు వర్షాలు ఇలానే ఉంటే వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, వరద ఉధృతి తగ్గిన తరువాత దానిని రిపేర్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ కొనసాగుతుంది. నదీ పరివాహక ప్రాంతాల్లోకి ప్రజలు ఎవరు వెళ్లొద్దని అధికారులు సూచించారు.