Cm Chandrababu: ఉగాదికి ఇళ్ల జాతర.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఈ ఒక్క ఏడాదిలోనే 10 లక్షల 60 వేల ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేస్తాం. అదనంగా 6 నుంచి 7 లక్షల ఇళ్లు కట్టాల్సిన అవసరం ఉంది.
Cm Chandrababu Representative Image (Image Credit To Original Source)
- 2029 నాటికి పేదలకు ఉచితంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు
- ఇల్లు లేని వాళ్లంతా దరఖాస్తు చేసుకోవాలి
- పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం
Cm Chandrababu: అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. పేదల సొంతింటి కలను నేరవేరుస్తామన్నారు. ఈ ఉగాదికి ఇళ్ల జాతర ఉంటుందని ప్రకటించారు. ఇల్లు లేని అర్హులకు ఇల్లు, ఇంటి జాగా ఇస్తామన్నారు. ఉగాది పండక్కి 3 లక్షల ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు చంద్రబాబు.
2029 నాటికి పేదలకు ఉచితంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు చంద్రబాబు. ఇల్లు లేని వాళ్లంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవన్నారు. వారికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తామ్నారు. ఈ ఏడాదిలోనే 10.63 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తామని తెలిపారు.
”2029లో అందరికి ఇంటి జాగా ఇవ్వాలనేది మా ప్రభుత్వ విధానం. 2 లక్షల 20వేల మందికి ఇంటి జాగాలు లేవు. అవన్ని ఎన్యుమరేట్ చేస్తున్నాం. వారందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు.. ఎక్కడన్నా ఇంటి జాగా దొరక్కపోతే అపార్ట్ మెంట్స్ కట్టించి అందరికీ ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం.
రాయచోటిలో 3 లక్షల ఇళ్లకు ప్రారంభం చేశా. ఉగాదికి రోజులు ముందు 3 లక్షల ఇల్లు గృహ ప్రవేశాలు చేస్తాం. జూన్ లో 2 లక్షల 50వేలు, సెప్టెంబర్ లో మరో 2లక్షల 10వేలు ఇల్లు గృహ ప్రవేశాలు చేస్తాం. ఈ ఒక్క ఏడాదిలోనే 10 లక్షల 60 వేల ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేస్తాం. అదనంగా 6 నుంచి 7 లక్షల ఇళ్లు కట్టాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలే ఆ పోర్టల్ ను ఓపెన్ చేసింది. అర్హులందరినీ కోరుతున్నాం. ఇప్పటివరకు ఇల్లు రాని వారంతా అప్లయ్ చేసుకోండి. వాటిని పరిశీలించి ఇల్లు లేని వారందరికీ ఇల్లు కట్టించే బాధ్యత అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు తీసుకుంటాయని నేను హామీ ఇస్తున్నా” అని చంద్రబాబు అన్నారు.
