Prakasam Barrage : ప్రకాశం బ్యారేజికి పెరుగుతున్న వరద ఉధృతి

విజయవాడ ప్రకాశం బ్యారేజికీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువున ఉన్న పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి విడుదలైన వరద నీరు ఆదివారం మధ్యాహ్నానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేశారు. 

Vijayawada Prakasam Barriage

Prakasam Barrage : విజయవాడ ప్రకాశం బ్యారేజికీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువున ఉన్న పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి విడుదలైన వరద నీరు ఆదివారం మధ్యాహ్నానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేశారు.  ప్రస్తుతం కృష్ణ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 33,002 క్యూసెక్కులు ఉండగా,ఔట్ ఫ్లో 24,750 క్యూసెక్కులు ఉంది. వరద ప్రభావిత మండలాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని….లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి . మత్య్సకారుల పడవలు,ఇళ్లల్లో పెంచుకునే పాడిపశువులు,మేకలు వంటివి సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాలని విజ్ఞప్తి చేశారు. బోట్లు,మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దనిహెచ్చరించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు.