Heavy Rain Alert For AP : ఏపీ ప్రజలకు అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని సూచన

ఏపీకి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ కారణంగా రెండు రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంది. అల్పపీడనం వాయుగుండగా మారి.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Rains in Hyderabad

Heavy Rain Alert For AP : ఏపీకి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ కారణంగా రెండు రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంది. అల్పపీడనం వాయుగుండగా మారి.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పారు.

భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీ వరద కొనసాగుతోంది. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద పెరిగింది. వర్షాలు కొనసాగితే మరో రెండు రోజుల పాటు వరద కొనసాగుతుందని అధికారులు తెలిపారు.