గుంటూరు జిల్లాలో వరద బీభత్సం.. కారు కొట్టుకుపోయి టీచర్, ఇద్దరు విద్యార్థుల మృతి.. విజయవాడలోనూ..

వర్షాలతో పలు చోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్‌లో..

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పాలపాడు వద్ద వరద బీభత్సం సృష్టించింది. ఉప్పలపాడు-గోళ్లమూడిపాడు మధ్య కాలువలో ఓ కారు కొట్టుకుపోయి అందులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీవీఐటీ-వీవా స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు టీచర్ రాఘవ, ఇద్దరు విద్యార్థులుగా అధికారులు గుర్తించారు.

విజయవాడలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్‌లో మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర సయ్యద్ అప్పలస్వామి కాలేజీ వెనుక చెట్టు కూలిపోయి అక్కడే ఉన్న ఆటో, కారుపై పడడంతో ఆటో, కార్ డ్యామేజ్ అయ్యాయి.

అక్కడ మనుషులు ఎవరూ లేపడంతో ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న కరెంటు పోల్ పై చెట్టు పడడంతో కరెంటు వైర్లు కూడా తెగి నేల మీద పడ్డాయి. స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. పక్కనే ఉన్న వేప చెట్టు కూడా పడిపోయే స్థితిలో ఉండగా వర్షం ఆగిన వెంటనే ఆ చెట్టును కూడా తొలగిస్తామని అధికారులు చెప్పారు.

కృష్ణానది వరద ప్రవాహం
కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక వద్ద కృష్ణానది వరద ప్రవాహం కొనసాగుతోంది. 20 రోజుల వ్యవధిలో రెండోసారి వరద తాకిడితో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పడవ ద్వారా పాతఎడ్లంక గ్రామస్తులు, రైతులు నదీ పాయ దాటుతున్నారు.

Also Read: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన.. ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాల గుర్తింపు

ట్రెండింగ్ వార్తలు