heavy rain alert
Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నాటికి అల్పపీడనం బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
Heavy Rain Alert in AP
గురువారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. శుక్ర, శని, ఆదివారాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉమ్మడి గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
Heavy Rain Alert in AP
శనివారం విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rain Alert in AP
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదివారం కూడా ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు తీరం వెంబడి గంటకు 45 నుంచి 70 కి.మీ వేగంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.