ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
అలాగే, నవంబరు 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు.
దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. కోస్తాంధ్రలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తాంధ్ర రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
మరోవైపు, తెలంగాణలో ప్రజలను చలి వణికిస్తోంది. వారం రోజుల నుంచి చలి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఉదయం 9 గంటల వరకు చలి ఉంటోంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల తర్వాతి నుంచి చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో ఆయా సమయాల్లో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. పలు ప్రాంతాల్లో చలితో పాటు పొగ మంచు కురుస్తుంది.
Tilak Varma: అయ్యో.. తిలక్ వర్మ ఎంత పనిచేశావ్..! వేలంలో ఉండిఉంటే..