Tirumala Devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ: 23 కంపార్టుమెంటుల్లో భక్తులు

సర్వదర్శనం టోకెన్ల జారీ కొనసాగుతుండడంతో ఇటీవలి కాలంలో స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. ఈక్రమంలోనే శుక్ర, శనివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు

Tirumala Devotees: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్ల జారీ కొనసాగుతుండడంతో ఇటీవలి కాలంలో స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. ఈక్రమంలోనే శుక్ర, శనివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయానికి వైకుంఠం క్యూ కంప్లెక్స్ లోని 23 కంపార్టుమెంటుల్లో భక్తులు నిండి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుందని అధికారులు ప్రకటించారు. శనివారం ఒక్కరోజే 76,324 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Also read:Cyclone Asani: బలపడిన వాయుగుండం.. నేడు తుపానుగా మారే చాన్స్

వారాంతం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. శనివారం 38,710 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు శ్రీవారి ఆలయంలో స్వామి వారికీ నిర్వహించే వారపు సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సమాచారం అందింది.

Also read:Tirumala Alert : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. వాటిపై నిషేధం, కొండపైకి అనుమతించరు

మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవ, గురువారం నిర్వహించే తిరుప్పావడ, శుక్రవారం నిర్వహించే నిజపాద దర్శన సేవలను వచ్చే వారం నుంచి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సమాచారం. వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు వారపు సేవలను శాశ్వతంగా రద్దు చేసిన టీటీడీ ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఆ సేవలను చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు