తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్‌లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి వచ్చేవారికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65,234 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.80 కోట్లు.
మరోవైపు, విజయవాడ ఇంద్రకీలాద్రిలో నేటి నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు జరుగుతాయని కార్యనిర్వాహణాధికారి వి.కె.శీనా నాయక్ తెలిపారు.
పవిత్రోత్సవాలు ఇలా..
- ఆగస్టు 8, 9, 10న పవిత్రోత్సవాలు
- ఇవాళ ఉదయం 9.30 నుంచి భక్తులకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం
- ఉదయం 9.30 నుంచి శ్రీ వరలక్ష్మీ అమ్మవారి అలంకారంలో దర్శనం ఇవ్వనున్న జగన్మాత శ్రీ కనకదుర్గా దేవి
- మూడు రోజుల పాటు అన్ని రకాల సేవలు నిలిపివేత
ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ ఈనెల 9న జరగనుంది. పౌర్ణమిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కామధేను ఆలయం నుంచి ఉదయం 5.55 గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది. కుమ్మరిపాలెం, సితార, కబేళా సెంటర్, మిల్క్ ప్రాజెక్టు, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి మీదుగా ఈ ప్రదక్షిణ సాగుతుంది.
వరలక్ష్మీ వత్రం జరుపుకుంటున్న మహిళలు
కాగా, నేడు మహిళలు, యువతులు శ్రీవరలక్ష్మీ వత్రం జరుపుకుంటున్నారు. అమ్మవారిని అలంకరించి వ్రతమాచరిస్తున్నారు. శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే పాపాలు పోతాయని, లక్ష్మీ ప్రసన్నం కలుగుతుందని వారి నమ్మకం.