Srisailam Traffic Jam : రోడ్లపై నిలిచిపోయిన వేలాది వాహనాలు.. శ్రీశైలంలో కొనసాగుతున్న భారీ ట్రాఫిక్ జామ్

శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ కంటిన్యూ అవుతోంది. 10 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ అడ్డదిడ్డంగా వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రం నుంచి రద్దీ కొనసాగుతోంది.

Srisailam Traffic Jam : శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ కంటిన్యూ అవుతోంది. 10 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ అడ్డదిడ్డంగా వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రం నుంచి రద్దీ కొనసాగుతోంది. శ్రీశైలం ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ భారీగా పెరిగింది. రోడ్డుపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో శ్రీశైలం-హైదరాబాద్ రూట్ లో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం నుంచి సాక్షి గణపతి, కటకేశ్వరం ముఖ ద్వారం వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై వేలాది కార్లు, బస్సులు, బైక్ లు నిలిచిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి రోడ్లపైనే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎప్పుడూ భక్తులతో కిటకిటాలాడే శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పది కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ అడ్డదిడ్డంగా వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రం నుంచి రద్దీ కొనసాగుతోంది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ భారీగా పెరిగింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పవిత్ర కార్తీకమాసం. దానికి తోడు ఆదివారం. ఇంకేముంది శ్రీశైల మహా క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో సొంత కార్లలో మల్లన్న దర్శనానికి తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి భక్తులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో ఆలయ క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 4 గంటలు, రూ.300 టికెట్‌ దర్శనానికి 2గంటలు, రూ.500ల శీఘ్ర దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. భక్తుల రద్దీతో అద్దె గదులన్నీ నిండిపోయాయి. సోమవారం వరకు భక్తుల రద్దీ కొనసాగుతుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.