Chittoor Rain : తప్పిన పెనుముప్పు, రాయల చెరువుకు గండి

రామచంద్రాపురం మండలానికి పెను ముప్పు తప్పింది. నిండుకుండలా మారిన రాయల చెరువుకు జేసీబీ సాయంతో అధికారులు గండి కొట్టారు.

Rayalacheruvu : చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలానికి పెను ముప్పు తప్పింది. నిండుకుండలా మారిన రాయల చెరువుకు జేసీబీ సాయంతో అధికారులు గండి కొట్టారు. దీంతో వరద నీరంతా దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతోంది. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం లేదని అధికారులు ప్రకటించడంతో.. సమీప గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 2021, నవంబర్ 20వ తేదీ శనివారం మధ్యాహ్నం సమయంలో వరద నీటితో రాయల చెరువు నిండిపోయింది.

Read More : Swachh Bharat Awards : ఏపీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డుల పంట

వరద నీరు రోడ్లపైకి చేరింది. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరిపోవడంతో.. రాయల చెరువు ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందారు. సమీప గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని చాటింపు వేశారు. ఆ తర్వాత జేసీబీ సాయంతో రాయల చెరువుకు గండి కొట్టడంతో వరద నీరంతా బయటకు వెళ్లిపోతోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా తిరుపతి నగరాన్ని వరద వదిలిపెట్టడం లేదు.  తిరుపతిలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి.

Read More : Lakshmi Parvati : ఎన్టీఆర్ గుండెపోటుకు చంద్రబాబే కారణం : లక్ష్మీపార్వతి

పద్మావతి యూనివర్శిటీ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఈ ఏరియాలో కరెంట్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. రెండు రోజులుగా  కరెంటు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు… రోడ్లపై మోకాలులోతు నీళ్లు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అటు తిరుమలగిరులన్నీ బురదమయంగా మారిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలతో పచ్చని గిరులన్నీ బురదమయంగా కనిపిస్తున్నాయి. బండరాళ్లు దొర్లి పడడంతో మెట్లమార్గాలు ధ్వంసమయ్యాయి. తిరుమలకు వెళ్లే కాలినడకమార్గం కంకరరాళ్లు తేలి దారుణంగా తయారైంది.  కింద నుంచి పై వరకు ఎక్కడ చూసినా రాళ్లు రప్పలే కనిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు