కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్: మరోసారి మార్క్ చూపించిన వర్మ

  • Publish Date - November 20, 2019 / 05:05 AM IST

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రెండో టీజర్ విడుదలైంది. సోషల్ మీడియాలో కొత్త టీజర్‌ ట్రెండింగ్‌గా మారింది. కొన్ని నిమిషాల నిడివితో..వర్మ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం వివాదాస్పదంగానే ఉంది. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను తెరకెక్కించారు.

ఎన్నికల్లో ఓడిపోవడంతో తండ్రి, కొడుకులు నిస్పృహలో పడిపోయారనేతో ట్రైలర్ మొదలైంది. కొడుకు మీద ప్రేమతో పార్టీని సర్వనాశనం చేశారని ఇతరులు అనుకుంటుంటారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఇటీవలి ఘటనలను కూడా ఇందులో చూపించారు. కూర్చొ..కళ్లు పెద్దదిగా పెట్టి చూస్తే..ఎవరూ భయపడరని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అనడం ఆసక్తికరంగా ఉంది.

స్పీకర్ స్థానంలో ఉన్న ఆలీ..నిద్రపోవడం..పవన్ కళ్యాణ్ పోలికలతో ఉన్న వ్యక్తి డైలా‌గ్‌లు చెప్పిన తర్వాత ఒక్కసారిగా హింసాత్మకంగా చూపించాడు వర్మ. లాస్ట్‌లో పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారంలో ఉన్న వ్యక్తి చెప్పడం హైలెట్‌గా నిలిచింది.

ఈ ట్రైలర్‌లో ట్రైలర్‌లో ఆలీ, బ్రహ్మానందం, స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. ఏపీలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించగా.. వర్మ రచన, సహ దర్శకత్వం వహించారు.
Read More : తలైవి కోసం తాత పాత్రలో తారక్: భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్న నిర్మాతలు