High Court: తిరుపతి ఉపఎన్నిక రద్దు పిటీషన్లను కొట్టివేసిన హైకోర్టు

Tirupati By-Election 2021: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ, బీజేపీలు హైకోర్టులో వేసిన వ్యాజ్యాలను కొట్టివేసింది హైకోర్టు. ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరగా.. రెండు పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు.. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు స్పష్టం చేసింది.

నకిలీ ఓటరు గుర్తింపు కార్డులతో దొంగ ఓట్లు వేయడానికి భారీ స్థాయిలో ప్రజలు వచ్చారని, ఓటేయడానికి వచ్చిన వారు తమ పేరు తండ్రి పేరు కూడా చెప్పలేకపోయారని పిటీషన్‌లో పేర్కొనగా.. దొంగ ఓట్లు వేయించడానికి బస్సులో వేలాది మందిని తరలించినట్లు పేర్కొనగా.. రెండు పిటిషన్లనూ కొట్టివేసింది ఏపీ హైకోర్టు.

తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. మరోపక్క తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని పిటిషన్ వేసింది టీడీపీ. ఈ నేపథ్యంలో రెండు పిటిషన్‌లు కలిపి విచారించగా.. పిటీషన్లను కొట్టివేసింది హైకోర్టు.

ట్రెండింగ్ వార్తలు