Anandaiah Medicine: ఆనందయ్య మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కరోనా పాజిటివ్ రోగులకు ఇచ్చే ఆనందయ్య K మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. పనితీరుపై హైకోర్టులో వాదనలు జరగగా.. విచారణ ఈ నెల 3వ తేదీన పూర్తయ్యింది.

High Court Green Signal to Anandaiah Medicine: కరోనా పాజిటివ్ రోగులకు ఇచ్చే ఆనందయ్య K మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. పనితీరుపై హైకోర్టులో వాదనలు జరగగా.. విచారణ ఈ నెల 3వ తేదీన పూర్తయ్యింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన మండలి నుంచి ఆనందయ్య K మందుపై నివేదిక అందిన తర్వాత సర్కారు అభ్యంతరం లేదని చెప్పగా.. తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు లేటెస్ట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీచేసింది.

ఆనందయ్య తయారు చేసిన K మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలని సూచించిన హైకోర్టు.. తదుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో నేటి నుంచి ఆనందయ్య K మందు పంపిణీకి లైన్ క్లియర్ అయ్యింది.

నేరుగా కరోనా బాధితులకు, వారి బంధువులకు ఆనందయ్య మందు పంపిణీ చేయలేమని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టంచేయగా.. చావుబతుకుల మధ్య ఉన్నవారికి మందు పంపిణీ చేయకపోవడం ఆర్టికల్‌ 21 ప్రకారం చట్టవిరుద్దమని న్యాయవాది యలమంజుల బాలాజీ వాదించారు. బాలాజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ఆనందయ్య K మందుపై ఆర్డర్స్‌ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు