వైఎస్ జగన్‌ భద్రతపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు

అనంతరం విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు.

Ys Jagan Security : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీపడొద్దని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. తనకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కుదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. జూన్ 3వరకు తనకున్న భద్రతను పునరుద్దరించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. వైఎస్ జగన్ కి మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు ఇవ్వడం లేదని సర్కార్ ని ప్రశ్నించింది. జగన్ కు మరో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కేటాయించాలని సూచించింది.

జామర్ ఏర్పాటుపైనా స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జగన్ కు జామర్ తో కూడిన వెహికల్స్ కూడా కేటాయిస్తామని కోర్టుకు వివరించింది రాష్ట్ర ప్రభుత్వం. మాజీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం భద్రత కల్పించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

తనకున్న భద్రత కుదించడంపై వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. జగన్ ప్రస్తుతం వినియోగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం బదులు వేరొక వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వైఎస్ జగన్ కి రిమోట్ కంట్రోల్ ద్వారా హాని జరిగే అవకాశం ఉన్న చోట జామర్ వెహికల్స్ ఏర్పాటు చేస్తామని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.

మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని కోర్టు అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. అనంతరం విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. మాజీ సీఎం జగన్ కు ప్రస్తుతం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు చేయిస్తామని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. ప్రత్యామ్నాయంగా మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేయటంపై చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం.

 

Also Read : దారుణ ఓటమితో రోజా సంచలన నిర్ణయం? ఏపీ రాజకీయాలకు గుడ్‌బై?

ట్రెండింగ్ వార్తలు