కర్నూలు జిల్లాలో జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై అడ్వకేట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో ఎప్పుడో హైకోర్టు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. త్వరగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి హైకోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
97 రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. డిసెంబర్ 17వ తేదీ మంగళవారం శాసనసభలో సీఎం జగన్ చేసిన ప్రకటనతో సంతోషం వ్యక్తం చేశారు. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం లాయర్లు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా 10tv లాయర్లతో మాట్లాడింది. సీఎం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మూడు రాజధానులు చేయడం వల్ల అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి..వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవలే పార్లమెంట్‌లో జరిగిన చర్చలో కేంద్ర న్యాయశాఖ మంత్రి వెల్లడించారని గుర్తు చేశారు. వృత్తులను పట్టుకుని కొన్ని రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. వందలాది ఎకరాలు అవసరం లేదని, వికేంద్రీకరణ అనేది ప్రజా విజయమన్నారు అడ్వకేట్స్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
* దక్షిణాఫ్రికా దేశానికి మూడు రాజధానులు ఉన్నాయని.. ఆ తరహాలోనే ఏపీకి మూడు రాజధానులు ఉంటే తప్పేంటన్నారు జగన్.
* అమరావతిలో చట్టసభలు ఉంటాయన్నారు జగన్.
* విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉంటుందున్నారు.
* సచివాలయం ఏర్పాటు చేస్తారు.
* హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయవచ్చని జగన్ సూచనప్రాయంగా చెప్పారు.
* జ్యుడిషియల్ కేపిటల్ ఒకవైపున… ఎగ్జిక్యూటివ్ కేపిటల్ మరోవైపున… లెజిస్లేటివ్ కేపిటల్ అమరావతిలో పెట్టొచ్చన్నారు సీఎం జగన్.
Read More : మూడు రాజధానులు..ఏపీకి మంచి జరుగుతుంది : జయప్రకాష్ నారాయణ