Nara Lokesh: లోకేశ్‌ను అక్టోబరు 4 వరకు అరెస్టు చేయొద్దన్న ఏపీ హైకోర్టు.. ప్రభుత్వం ఏం చెప్పింది?

ఏజీ శ్రీరాం వాదిస్తూ... లోకేశ్ ను అరెస్ట్ చేయాలని అనుకుంటే ఇప్పటికే అరెస్ట్ చేసే వారిమని తెలిపారు. ఇంకా..

Nara Lokesh

Skill development Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్ కావాలని న్యాయమూర్తి‌ని‌ లోకేశ్ తరఫు న్యాయవాదులు కోరారు. బుధవారం వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అన్నారు.

ఈ కేసులో ప్రభుత్వ తరఫున ఏజీ శ్రీరాం వాదిస్తూ… లోకేశ్ ను అరెస్ట్ చేయాలని అనుకుంటే ఇప్పటికే అరెస్ట్ చేసే వారిమని తెలిపారు. ఈ స్కాంలో చంద్రబాబు నాయుడు ప్రధాన నిందితుడని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు లబ్ధి పొందారని వివరించారు. అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచామని తెలిపారు.

ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు వచ్చే నెల 4 వరకు లోకేశ్ ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై మళ్లీ అదే రోజు విచారణ చేపడతామని తెలిపింది.

ఫైబర్ నెట్ స్కామ్ కేసులో?
ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే నెల 4కి హైకోర్టు వాయిదా వేసింది. దీంతో నారా లోకేశ్ పిటిషన్ తో పాటు చంద్రబాబు పిటిషన్ పై ఒకేరోజు మళ్లీ వాదనలు జరగనున్నాయి.

Sajjala Ramakrishna Reddy : టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ.. లక్ష గ్లోబల్స్ కలిస్తే ఒక్క చంద్రబాబుతో సమానం : సజ్జల రామకృష్ణారెడ్డి

ట్రెండింగ్ వార్తలు