High Court : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.

Chandrababu bail Petition

High Court – Chandrababu Bail Petition : టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇదిలావుంటే సోమవారం ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.

కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు స్నేహ బ్లాక్ ను కేటాయిచారు. ప్రత్యేక గదిని కూడా ఇచ్చారు. అప్పటినుంచి నెల రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారు.

Vishnu Kumar Raju టీడీపీ- జనసేన పొత్తుపై విష్ణుకుమార్‌రాజు హ్యాపీ.. ఆయన సంబరానికి కారణమేంటి?

మరోవైపు చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. టీడీపీతోపాటు పలువురు ఆందోళన, కార్యక్రమాలను చేస్తున్నారు. చంద్రబాబు సతీమణి, లోకేష్ భార్య బ్రాహ్మణి ప్రత్యక్షంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు.