AP High Court : సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 35పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

AP High Court : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 35ను సస్పెండ్ చేస్తూ గతవారం సింగిల్ బీచ్ తీర్పు ఇచ్చిన విషయం విదితమే.. సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం డివిజన్ బెంచ్ కి వెళ్ళింది. సోమవారం విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ టికెట్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేసింది. టికెట్ల ధరల నియంత్రణపై జీవో నంబర్‌ 35 రద్దు అన్ని థియేటర్లకి వర్తిస్తుందన్నారు అడిషనల్‌ జనరల్.

చదవండి : High Court : ఇళ్ల మధ్య పబ్ లు, బార్ల ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్

అయితే గత విచారణలో పిటిషనర్లకే జీవో నుంచి మినహాయింపు వస్తుందని హోమ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ తెలిపిన సంగతి తెలిసిందే.. ధరల పెంపుపై ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్లకు పంపాలన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్.. వివరాలను అడిషనల్‌ అఫిడవిట్‌లో దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల నియంత్రణపై ఏర్పాటైన కమిటీ వివరాలు తెలిపేందుకు హైకోర్టు గడువిచ్చింది. ఇక తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

చదవండి : High Court : సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ట్రెండింగ్ వార్తలు