High Court : ఇళ్ల మధ్య పబ్ లు, బార్ల ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ టాట్ పబ్ ముందు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్యలో పబ్ నిర్వహణతో ప్రతి రోజూ న్యు సెన్స్ ఎక్కువైందంటూ ఆందోళన చేపట్టారు.

High Court : ఇళ్ల మధ్య పబ్ లు, బార్ల ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్

High Court

pubs and bars between houses : ఇళ్ల మధ్య పబ్ లు, బార్ల ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. పబ్ లు, బార్ల ఏర్పాటుపై జూబ్లీహిల్స్ లోని రెసిడెన్షియల్ అసోసియేషన్స్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ ఏరియాలో పబ్ లతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పబ్ ల ఏర్పాటు విధి విధానాలు తెలపాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ టాట్ పబ్ ముందు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్యలో పబ్ నిర్వహణతో ప్రతి రోజూ న్యు సెన్స్ ఎక్కువైందంటూ ఆందోళన చేపట్టారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. రాత్రిళ్ళు 2, 3 గంటల వరకు పబ్ మ్యూజిక్ సిస్టమ్, యువత అసభ్యకర ప్రవర్తన తీవ్ర అబ్యంతకరంగా ఉంటుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Cows Died : విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో సరైన పోషణ లేక.. 12 ఆవులు మృతి

కొందరు యువకులు పబ్ లో తాగేసి బాటిల్స్ ఇళ్లలోకి విసురుతున్నారని పేర్కొన్నారు. ఇళ్లల్లో వృద్ధులు, పెద్ద వారు, చిన్న వారికి తలనొప్పిగా టాట్ పబ్ మారింది. గతంలో టాట్ పబ్ లో రేవ్ పార్టీ లు, అసభ్యకర నృత్యాలతోపాటు పలు కేసులు ఉన్నాయని తెలిపారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎక్సైజ్ పోలీసులు, లోకల్ పోలీసులు పట్టించుకోవడం లేదని అవేదన చెందుతున్నారు. వెంటనే పబ్ ను ఇక్కడి నుండి తీసివేయాలి ఆందోళన చేపట్టారు.