Cows Died : విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో సరైన పోషణ లేక.. 12 ఆవులు మృతి

అక్రమంగా తరలిస్తున్న ఆవులను పోలీసులు పట్టుకుని ఆశ్రమానికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆవులు చనిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Cows Died : విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో సరైన పోషణ లేక.. 12 ఆవులు మృతి

Cow

Updated On : December 17, 2021 / 3:33 PM IST

Visakha Gnanananda Ashram : విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమంలో ఆవులు మృత్యువాత పడ్డాయి. పోషణ లేకపోవడంతో 12 ఆవులు మృతి చెందాయి. మరికొన్ని అవులు చనిపోయే స్థితిలో ఉన్నాయి. అక్రమంగా తరలిస్తున్న ఆవులను పోలీసులు పట్టుకుని ఆశ్రమానికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆవులు చనిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సింహాచలం గోశాలకు తరలిస్తే ఆవులు బతికేవని అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గోశాలను సందర్శించారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.