stone pelting at TDP leader Kanna lakshminarayana program
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాడుతుండడంతో కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
జెండా ఆవిష్కరణతో పాటు పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొనాల్సి ఉండగా గుర్తు తెలియని దుండగులు పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు. లైట్లు ఆర్పివేసి, భవనాల పై నుంచి ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో కన్నా వ్యక్తిగత సహాయకుడితో పాటు 15 మందికి పైగా గాయాలయ్యాయి. బందోబస్తుకు వచ్చిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. ప్రస్తుతం తొండపి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ప్రజలే బుద్ధి చెబుతారు..
రాళ్ల దాడిపై కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. రాక్షస పాలనకు చరమగీతం పాడాలనే టీడీపీలో చేరినట్లు తెలిపారు. మంత్రి అంబటి రాంబాబు ఈ రాళ్ల దాడికి చేయించినట్లుగా ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో సత్తెనపల్లి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని అన్నారు.
YS Sharmila: అందుకే నేను ఏపీకి వచ్చి పోరాడుతున్నాను: షర్మిల
ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై అంబటి రాంబాబు దాడులు చేయించారని, రాళ్ల దాడి చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నాడని విమర్శించారు. ప్రతి చర్యకు ఓటుతో సమాధానం చెబుతారని హెచ్చరించారు. దాడిలో గాయపడిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు కన్నా లక్ష్మినారాయణ, ఇలాంటి దాడులు పార్టీ నాయకులు, కార్యకర్తలని భయపెట్టలేవని, మరింత సంఘటితంగా పోరాడేలా చేస్తాయని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్న మంత్రి అంబటి రాంబాబు చేయించిన రాళ్ల దాడికి రానున్న ఎన్నికల్లో సత్తెనపల్లి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారు.
ఉద్దేశపూర్వకంగా అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులను ప్రోత్సహిస్తూ పైశాచిక ఆనందం… pic.twitter.com/yuNy9r1EDl
— Kanna Lakshmi Narayana (@KLNTDP) January 28, 2024