Attack On Ministers Cars : విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల కార్లపై దాడి జరిగింది. మంత్రులు రోజా, జోగి రమేశ్, వైవీ సుబ్డారెడ్డి కార్లపై దాడి జరిగింది. విశాఖ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడి జనసేన కార్యకర్తలే పని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు.
”తమ కార్లపై దాడిపై మంత్రి జోగి రమేశ్ ఫైర్ అయ్యారు. జనసేనాని పవన్ కల్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు. ”తాగుబోతులు, రౌడీలు మా కార్లపై రాళ్లు వేశారు. అరాచకశక్తులు చేసే కార్యక్రమం ఇది. ఇది మంచి పద్ధతి కాదు. జనసేన కార్యకర్తలను పవన్ అదుపులో ఉంచుకోవాలి. చిల్లరవేషాలు వేస్తే ఊరుకునేది లేదు. మేము తలుచుకుంటే పవన్ ఎక్కడా తిరగలేరు” అని పవన్ ను మంత్రి జోగి రమేశ్ తీవ్రంగా హెచ్చరించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఈ ఘటనతో ఎయిర్ పోర్టు దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అధికార వైసీపీ చేపట్టిన విశాఖ గర్జనకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో వైసీపీ కీలక నేత, టీటీడీ చైర్మర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, మాజీ మంత్రి పేర్ని నాని కార్లపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సుబ్బారెడ్డితో పాటు మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
విశాఖ గర్జనకు హాజరైన సుబ్బారెడ్డి, రోజా, జోగి రమేశ్, పేర్ని నాని కార్యక్రమాన్ని ముగించుకుని శనివారం సాయంత్రం ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కోసం పవన్ కల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌కు స్వాగతం పలికేందుకు జన సైనికులు భారీ సంఖ్యలో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సమయంలోనే వైసీపీ నేతల కార్లు కనిపించడంతో కర్రలు, రాళ్లతో జనసైనికులు దాడికి దిగారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ దాడితో విశాఖలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.