Visakhapatnam Honour Killing : విశాఖపట్నంలోని రెల్లి వీధిలో దారుణం జరిగింది. పరువు హత్య కలకలం రేపింది. కన్నతండ్రే కూతురిని కడేతేర్చాడు. ఓ అబ్బాయిని ప్రేమించిందనే కోపంతో ఓ తండ్రి తన కన్న కూతురినే దారుణంగా హత్య చేశాడు. కూతురిని చంపుతూ సెల్ఫీ వీడియో తీసిన అతడు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత వన్ టౌన్ పోలీసుల ముందు లొంగిపోయాడు. యువతి మృతదేహాన్ని పోలీసులు కేజీహెచ్ కు తరలించారు.
ఆ తండ్రి పేరు వరప్రసాద్. 13 ఏళ్ల క్రితం వరప్రసాద్ భార్య వదిలి వెళ్లిపోయింది. తన ఇద్దరు పిల్లలను వరప్రసాద్ కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఇద్దరు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాడు. కూతుళ్లిద్దరిని పైస్థాయిలో చూడాలని అతడు కలలుకన్నాడు. అయితే పెద్దకూతురు కొన్ని నెలల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఇప్పుడ చిన్న కూతురు కూడా ప్రేమ వ్యవహారం నడుపుతోందని తెలుసుకుని తండ్రి వరప్రసాద్ మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తండ్రి, కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్ను బాగా చదివించాను, బాగా చూసుకున్నాను, ప్రేమ జోలికి వెళ్లొద్దు అని వరప్రసాద్ తన కూతురికి నచ్చ చెప్పాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. ప్రేమాయణం సాగింది. దీంతో కోపోద్రిక్తుడు అయిన వరప్రసాద్ కూతురిని కడతేర్చాడు. కన్న తండ్రి అయిన తన మాటే లెక్క చేయకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
రెండు రోజుల క్రితమే తన కూతురు నిఖితను హత్య చేసిన వరప్రసాద్.. తన కూతురు అరవింద్ అనే యువకుడితో వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వరప్రసాద్ ఇంటి తలుపులు తెరిచి చూశారు. ఇంట్లో డెడ్ బాడీ చూసి షాక్ అయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు వరప్రసాద్ ను అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. ఇది ప్రేమ వ్యవహారమా? లేక మరో కారణమా? దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే యాంగిల్స్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేను నా కూతురిని చంపేశాను అని తండ్రి వరప్రసాద్ సెల్ఫీ వీడియోలో చెప్పారు. అంతేకాదు కూతురి డెడ్ బాడీని కూడా ఆయన చూపించారు. అయితే, ప్రేమ వ్యవహారమే కాకుండా ఇంకా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా ఈ హత్య వెనుక అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.