ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం సాగిందిలా..

చంద్రబాబు నాయుడితో పాటు మంత్రులందరూ దైవసాక్షిగా తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. టీజీ భరత్ ఒక్కరే ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.

Andhra Pradesh Cabinet oath ceremony

Andhra Pradesh Cabinet Oath Ceremony: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరిగిన ప్రమాణస్వీకారమహోత్సవానికి అతిరథులు తరలివచ్చారు. ఉదయం 11.33 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో చంద్రబాబు నాయుడు దైవసాక్షిగా తెలుగులో ప్రమాణం చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఎన్ఎండీ ఫరూఖ్ అల్లా సాక్షిగా ప్రమాణం చేయగా, టీజీ భరత్ ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.

మధ్యాహ్నం 12.25 నిమిషాలకు మంత్రుల ప్రమాణ స్వీకారమహోత్సవం ముగిసింది. జాతీయగీతాలాపన తర్వాత ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి మంత్రివర్గ సభ్యులు గ్రూప్ ఫొటో దిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరపున ప్రధాని మోదీని చంద్రబాబు, పవన్ కల్యాణ్ సత్కరించి.. వేంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్ తో కలిసి ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం సూపర్ స్టార్ రజనీ కాంత్, వెంకయ్య నాయుడితో ప్రధాని మోదీ ముచ్చటించారు.

Also Read: కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను.. ఏపీ మంత్రిగా జనసేనాని ప్రమాణస్వీకారం

మంత్రుల ప్రమాణస్వీకారం సాగిందిలా..
1. కొణిదెల పవన్ కళ్యాణ్ (పిఠాపురం)
2. నారా లోకేశ్ (మంగళగిరి)
3. అచ్చెన్నాయుడు (టెక్కలి)
4. కొల్లు రవీంద్ర (మచిలీపట్నం)
5. నాదెండ్ల మనోహర్ (తెనాలి)
6. పి. నారాయణ (నెల్లూరు సిటీ)
7. వంగలపూడి అనిత (పాయకరావుపేట)
8. సత్యకుమార్ యాదవ్ (ధర్మవరం)
9. నిమ్మల రామానాయుడు (పాలకొల్లు)
10. ఎన్ఎండీ ఫరూఖ్ (నంద్యాల)
11. ఆనం రామనారాయణ రెడ్డి (ఆత్మకూరు)
12. పయ్యావుల కేశ్ (ఉరవకొండ)
13. అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)
14. కొలుసు పార్థసారధి (నూజివీడు)
15. బాల వీరాంజనేయస్వామి (కొండపి)
16. గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి)
17. కందుల దుర్గేశ్ (నిడదవోలు)
18. గుమ్మడి సంధ్యారాణి (సాలూరు)
19. బీసీ జనార్దన్ రెడ్డి (బనగానపల్లె)
20. టీజీ భరత్ (కర్నూలు)
21. ఎస్. సవిత (పెనుకొండ)
22. వాసంశెట్టి సుభాష్ (రామచంద్రాపురం)
23. కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం)
24. రాంప్రసాద్ రెడ్డి(రాయచోటి)