Suicide : పెళ్లైన ఆరు నెలలకే ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య
విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. నూరేళ్ల బంధం ఆరు నెలలకే ముగిసింది. పెళ్లైన ఆరు నెలలకే ఉరివేసుకొని భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Suicide
Husband and wife commit suicide : విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. నూరేళ్ల బంధం ఆరు నెలలకే ముగిసింది. పెళ్లైన ఆరు నెలలకే ఉరివేసుకొని భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాము, హేమ దంపతులు కొత్తవలస మండలం చీపురువలసలో నివాసముంటున్నారు.
రాము జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. భర్త బయటకు వెళ్లిన సమయంలో భార్య హేమ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది. భార్య మృతి వార్త తెలిసి మనస్తాపంతో భర్త రాము చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Live-Puneeth Rajkumar : ఇక సెలవు… పునీత్ అంత్యక్రియలు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. వీరి ఆత్మహత్యలకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.