×
Ad

ఏపీలోనూ హైడ్రా మోడల్.. పవన్‌ ప్లాన్ అదేనా..? నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటి? ఇక బుల్డోజర్లు..

తెలంగాణలో హైడ్రా హైదరాబాద్‌కే పరిమితమైంది. ట్విన్‌ సిటీస్‌లో నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై బుల్డోజర్లను దించేస్తోంది.

AP Hydra Model: హైదరాబాద్‌లో హైడ్రా రఫ్పాడించేస్తోంది. ఆక్రమణలను ఖతం చేయడమే పనిగా పెట్టుకుంది. దీంతో హైడ్రా మోడల్‌ టాక్ ఆఫ్‌ ది నేషన్‌గా మారింది. హైడ్రా పనితీరు మీద విమర్శలు ఉన్నా..కాలనీలు, బస్తీల్లో కబ్జాలకు చెక్ పెడుతుందన్న టాక్ అయితే బలంగా ఉంది. అయితే తెలంగాణలో ఇంప్లిమెంట్‌ అవుతున్న హైడ్రా మోడల్‌ ఇప్పుడు ఏపీ పాలకులను అట్రాక్ట్‌ చేస్తోందట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ భేటీ అవడంతో ఇదే చర్చ తెరమీదకు వచ్చింది.

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్రత్యేకంగా ఏపీకి వచ్చారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసులో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఇద్దరూ చాలా అంశాల మీద చర్చించుకున్నారని చెబుతున్నారు. అంతే కాదు హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా అవసరం అని ఈ సందర్భంగా పవన్ అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. పాలకుల ముందు చూపు అలాగే నిబద్ధత కలిగిన అధికారుల పనితీరు ఏ వ్యవస్థకు అయినా మంచి పేరు తీసుకొస్తాయని పవన్ తన ఒపీనియన్ వ్యక్తం చేశారట. (AP Hydra Model)

Also Read: ‘ప్రధాన్ మంత్రి కౌశల్ ముద్ర యోజన’ వచ్చేస్తుంది..! రెడీగా ఉన్నారా? మీకు ఏమేం ఇస్తారంటే?

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పవన్ ప్రత్యేకంగా కలిశారంటే సమ్‌థింగ్‌ ఈజ్‌ దేర్ అన్న చర్చ మొదలైంది. పవన్ పిలిపించుకున్నారా లేక ఆయనే పవన్ అపాయింట్‌మెంట్‌ తీసుకుని మరీ కలిశారా అన్నది క్లారిటీ లేదు. కానీ పవన్, రంగనాథ్‌ భేటీ తర్వాత మాత్రం..ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా అన్నదే చర్చనీయాంశం అవుతోంది.

పవన్ అయితే అటవీ శాఖతో సహా ఏ శాఖకు చెందిన భూములు కబ్జాకు గురి అయితే సహించేది లేదని స్పష్టంగా చెబుతున్నారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అయితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన ఇప్పటికే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా మోడల్‌ను ఏపీలోనూ అందుబాటులోకి తీసుకొస్తే ఎలా ఉంటుందనే దానిపై..రంగనాథ్‌తో భేటీలో ఆరా తీసినట్లు ఇన్‌సైడ్‌ టాక్.

అమలు చేయడం అంత సింపుల్ కాదు

ఏపీలో హైడ్రా మోడల్‌ అమలు చేయడం అంత సింపుల్ కాదు. తెలంగాణలో హైడ్రా హైదరాబాద్‌కే పరిమితమైంది. ట్విన్‌ సిటీస్‌లో నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై బుల్డోజర్లను దించేస్తోంది. అయితే ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, కర్నూలు, కడప, విజయనగరం.. ఇలా నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి.

విశాఖలో భూముల ఆక్రమణ అనే ఆరోపణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఉన్న పెద్ద చర్చ. వరదల సందర్భంగా విజయవాడలో కొల్లేరు కబ్జాలు, ఆక్రమణల కథ చర్చనీయాంశం అయింది. కాకినాడలో సముద్ర తీర ప్రాంతంలో కబ్జాలు..జనావాసాల్లోకి నీళ్లు..రెగ్యులర్‌ ఎపిసోడ్‌. అలా ఏపీలో పలు పట్టణాల్లో ఈ ఆక్రమణ అంశం పెద్ద చర్చగా ఉంది.

వీటన్నింటి వివరాలు బయటికి తీసి బుల్డోజర్ల రంగంలోకి దిగితే మాత్రం..ఏపీలో అనేక సంచలనాలు నమోదు అయ్యే అవకాశాలు లేకపోలేదు. అభివృద్ధి చెందిన ప్రాంతాలలో అయితే కబ్జాలు, ఆక్రమణల లొల్లి ఎక్కువే. పవన్ ఓ అడుగు ముందుకేసి హైడ్రా మోడల్‌ తీసుకొస్తే మాత్రం ఏపీలో కబ్జాదారులకు నిద్ర లేని రాత్రులే అని అంటున్నారు. పవన్ ఈ విషయంలో ఆసక్తిగా ఉన్నారని..కచ్చితంగా కూటమి ప్రభుత్వం దీనిపై సీరియస్‌గానే అడుగులు వేస్తుందని అంటున్నారు. ఏపీలో హైడ్రా మోడల్‌ వస్తుందో రాదో..చూడాలి మరి.