నాకు ఒక్కతే భార్య..ఇద్దరు ఆడపిల్లలు..ఒక చెల్లే..ఉన్నారని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. కొంతమంది నాయకులకు ముగ్గురు, నలుగురు భార్యలున్నా సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశా ఘటన ఏపీ రాష్ట్రంలో జరిగితే ఎలా స్పందించాలి ? ఇక్కడి పోలీసులు ఎలా వ్యవహరించాలి ? మనకు మనం ప్రశ్నించుకోవాలన్నారు. ఇన్సిడెంట్‌కు సంబంధించినవి చూడడం..విన్న తర్వాత..ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధలు, ఆవేదన..చూసిన తర్వాత..కాల్చేసినా తప్పులేదని అందరం అనుకున్నామన్నారు.
2019, డిసెంబర్ 09వ తేదీన సోమవారం అసెంబ్లీలో మహిళల భద్రత బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ఒక ఘటన జరిగిన తర్వాత..ఒక తండ్రిగా ఎలా స్పందించాలన్నారు. వారికి ఏ శిక్షమైన పడుతుందో తనకు ఉపశమనం కలుగుతుందనే ఆలోచన వస్తుందన్నారు. దారుణమైన చట్టాలున్నాయన్నారు. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు అవుతున్నా..నిందితులు ముందే తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసులు, కోర్టులు జాప్యం చేసే పరిస్థితి ఉన్నప్పుడు, చట్టాలు మారాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా..రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తులు ఏం చేయాలనే దానిపై ఆలోచన చేయాలన్నారు సీఎం జగన్. కొన్ని దేశాల్లో ఎలా వ్యవహరిస్తారో గమనించాలన్నారు. వారం రోజుల్లో లోపు ఇన్వేస్టిగేషన్ చేసేయాలి, ఆ తర్వాత రెండు వారాల్లోపు ట్రయల్ కూడా జరపాలి..మూడు వారాల్లో ఏకంగా ఉరిశిక్ష పడే విధంగా చట్టాలు తీసుకరావాలన్నారు సీఎం జగన్.
Read More : అసెంబ్లీలో సీఎం జగన్ : బాబు పాలనలో..అత్యాచారాలు..వేధింపులు లెక్కలు