Pawan Kalyan
Pawan Kalyan – Janasena : వాలంటీర్లు, వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. పవన్ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. పవన్ కల్యాణ్ పై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. అయినా జనసేనాని మాత్రం తగ్గేదేలే అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ గురించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని పవన్ చెబుతున్నారు. తాజాగా మరోసారి వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్ కల్యాణ్.
వాలంటీర్లపై నేను చేసిన వ్యాఖ్యలకు విచారణ చెయ్యమని ప్రభుత్వం జీవో ఇచ్చిందని పవన్ తెలిపారు. అన్ని రిస్కులకు నేను సిద్ధంగా ఉన్నాను అని పవన్ అన్నారు. నన్ను అరెస్టు చేసుకోండి, చిత్రహింసలు చేసుకోండి అని వ్యాఖ్యానించారు. నా కమిట్ మెంట్ ఏపీ అభివృద్ధి అని తేల్చి చెప్పారు. జైలుకి వెళ్లడానికి, దెబ్బలు తినడానికి కూడా సిద్ధమే అన్నారు పవన్ కల్యాణ్.
Also Read..YS Jagan: సీఎం జగన్ మనసులో ఏముంది.. సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఖరారు చేస్తారా?
”వాలంటీర్ కు రోజుకి 164 రూపాయలు ఇస్తున్నారు. ఉపాధి హామీ పథకం కూలీ కంటే తక్కువ. విలువైన వ్యక్తిగత డేటా భద్రపరుచుకోవడం చాలా కీలకం. వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుంది? 23 అంశాలపై డేటా సేకరణ జరుగుతోంది? ఏం చేస్తున్నారు? ఇదంతా డేటా చౌర్యం కిందకు వస్తుంది. 2.5లక్షల వాలంటీర్ల భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళా.
బ్యాంక్ వివరాలు అనుకోని వారి చేతిలోకి వెళ్తే డబ్బులు దోచేస్తారు. ఈ డేటా మొత్తం హైదరాబాద్ లో ఉన్న foa అనే కంపెనీ కి వెళ్తుంది. మూడు కంపెనీలకు డేటా వెళ్తోంది. ఆ కంపెనీల వెనుక వైసీపీ వాళ్లు ఎవరు ఉన్నారు? విచారణ చెయ్యమని జీఓ ఇచ్చారు. ప్రభుత్వాన్ని కిందకు లాగేది ఇదే. జగన్ మైనింగ్ అక్రమాలు, దోపిడీ మొత్తం బయటకు తీస్తా. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. గుర్తు పెట్టుకోండి” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
పంచకర్ల రమేశ్ బాబును పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. రమేశ్ బాబు మా ఇంట్లో కుటుంబసభ్యుడు లాంటి వారు అని అన్నారు. రమేశ్ బాబుకి పార్టీలో సముచిత స్థానం, గౌరవం ఇస్తామన్నారు జనసేనాని పవన్.