AP News Today
Andhra pradesh: వివేకా కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కడపలో మూడు రోజులుగా అధికారులు విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు పుట్టిన రోజు కావడంతో టీడీపీ రాష్ట్ర పార్టీ నేతలు ప్రకాశం జిల్లాకు చేరుకొని బాబు బర్త్ డే వేడుకల్లో పాల్గోనున్నారు. వీటితోపాటు ఏపీలోని ముఖ్యమైన వార్తల వివరాలను పరిశీలిస్తే..
YS Vivekananda Reddy (File Photo)
వివేకా కేసు అప్డేట్..
వివేకానంద హత్య కేసులో సీబీఐ బృందం దర్యాప్తు కడపలో కొనసాగుతోంది. మూడు రోజులుగా కడపలో సీబీఐ అధికారులు మకాం వేశారు. నేడో, రేపో పులివెందులకు చెందిన మరి కొందరు అనుమానితులను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
………………………………………………………………………………………..
luxury bus overturned in Kadapa district
కడప జిల్లాలో లగ్జరీ బస్సు బోల్తా ..
జిల్లాలోని దువ్వూరు మండలం గుడిపాడు వద్ద కడప – కర్నూల్ జాతీయ రహదారిపై లగ్జరీ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇరువురు మహిళలకు తీవ్ర గాయాలు కాగా, దాదాపు15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాదు నుండి తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డోర్లు ఓపెన్ కాకపోవడంతో ప్రయాణీకులు బస్సులోనే ఉండిపోవాల్సి వచ్చింది. కొద్దిసేపటికి గుడిపాడు గ్రామ ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీశారు. గాయాలపాలైన వారిని 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు
………………………………………………………………………………………..
Chandrababu Naidu
ప్రకాశం జిల్లా చంద్రబాబు పర్యటన..
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత మార్కాపురంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన రెండవ రోజు కొనసాగనుంది. ఉదయం 10గంటలకు చిన్నారులు, మహిళల సమక్షంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు మార్కాపురంకు రాష్ట్ర పార్టీ నాయకులు తరలివచ్చారు.
పర్యటన ఇలా..
ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు మహిళలతో సమీక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు మార్కాపురం నియోజకవర్గ ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్థానికబస్ స్టాండ్ సెంటర్ నుండి ఎస్వీ కేపి కాలేజీ వరకు రోడ్డు షోలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ఎస్వీ కేపి కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభా ప్రసంగం ముగిసిన అనంతరం శ్రీ సాయి బాలాజీ స్కూల్ ఎదురుగా ఏర్పాటుచేసిన ప్రాంగణంలో రాత్రి బస చేస్తారు. రేపు మధ్యాహ్నం 2గంటలకు మార్కాపురం నుండి యర్రగొండపాలెంకు రోడ్డు మార్గాన చంద్రబాబు వెళ్లనున్నారు.
……………………………………………………………………………………
Vizag Steel Plant
బిడ్డింగ్‌కు లాస్ట్ డే..
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈవోఐ బిడ్డింగ్‌కు నేటితో గడువు ముగియనుంది. సాయంత్రం 3 గంటల వరకు బిడ్డింగ్ అవకాశం ఉంది. ఇప్పటి వరకు బిడ్డింగ్‌లో 22 సంస్థలు పాల్గొన్నాయి. మరిన్ని కంపెనీలు పాల్గొంటాయనే సమాచారంతో గడువు పెంపు చేశారు. ఇప్పటికే బిడ్డింగ్ లో పాల్గొన్న 22 సంస్థల్లో కొన్ని సంస్థలు రోలింగ్ మిల్స్ కావాలంటున్నాయి. అదేవిధంగా వి.బి. లక్ష్మీనారాయణ వెన్ స్ర్పా ఇంపెక్స్ కంపెనీ తరపున బిడ్ దాఖలు చేశారు. అమెరికా నుండి నిధులు తెచ్చి స్టీల్ ప్లాంట్ కొంటానని ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ ప్రకటించారు. సెయిల్, ఎన్‌ఎండీసీలు, బిడ్డింగ్ లో పాల్గొంటున్న కార్మిక సంఘాలు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ బిడ్డింగ్ పాల్గొంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకు సింగరేణి సంస్థ బిడ్డింగ్ దాఖలు కాలేదు. ఈరోజు లాస్ట్ డే కావడంతో బిడ్డింగ్ పై ఎం జరుగుతుందన్నఉత్కంఠ నెలకొంది. పోటీలో బడా కంపెనీలు ఉన్నాయి.