ED Rides at musaddilal gems and jewellery
ED Rides at musaddilal gems and jewellery : తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. దీంట్లో భాగంగానే హైదరాబాద్ నగరంలోని ఎర్రమంజిల్ లో ఉన్న ముసిద్దిలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్ కార్యాలయంలో ఈడీ అధికారులు రెండోరోజు సోదాలు నిర్వహిస్తున్నారు. 20 గంటలుగా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. నిన్న ఎర్రమంజిల్ లోని షోరూంతో పాటు హైదరాబాద్ నగరంలోని మిగతా షోరూంలు. అలాగే ఏపీలోని విజయవాడ, గుంటూరులో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారులు పలు బృందాలుగా విడిపోయా హైదరాబాద్, విజయవాడ, గుంటూరులో దాడులు కొనసాగిస్తున్నారు.దీంట్లో భాగంగా హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లోని ముసిద్దిలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్లో సోదాలు నిర్వహిస్తున్నారు. షోరూంలోకి ఎవ్వరిని లోపలికి రాకుండా పోలీసుల బందోబస్తుతో సోదాలు చేస్తున్నారు.
ముసిద్దిలాల్ బ్యాంక్ నుంచి భారీగా రుణాలు తీసుకుని ఎగవేసినట్లుగా అధికారులు గుర్తంచారు. అలాగే పెద్దనోట్లు రద్దు సమయంలో కూడా నకిలీ ఇన్వాయిస్ లతో భారీగా మోసాలకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ముసిద్దిలాల్ సంస్థ జరిపిన బ్యాంక్ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. షోరూమ్ లోని బంగారాన్ని స్టాక్స్, సేల్స్ రికార్డ్స్ పై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. స్టాక్స్, సేల్స్ లో పలు అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలు వచ్చాయి. దీంతో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఈ దాడులను ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.