IT raids In RS Brothers
IT raids In RS Brothers : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో నగరంలోని పలు షాపింగ్ మాల్స్ లో ఐటీ అధికారలు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు హైదరాబాద్ లోనే కాక ఏపీ, తెలంగాణలోని పలు షాపింగ్ మాల్స్ లో ఏకకాలంలో మొత్తం 20 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. మాల్స్ లోని ఉద్యోగుల నుంచి ఐటీ అధికారులు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఆర్ఎస్ బ్రదర్స్,సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్, లాట్ మొబైల్ షాపుల్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. పలు బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు ఏకకాలంలో ఏపీలోని విజయవాడ,గుంటూరు వంటి నగరాలతో పాటు హైదరాబాద్ లోని పలు షాపింగ్ మాల్స్ లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆర్ ఎస్ బ్రదర్స్ యాజమాన్యం హానర్స్ రియల్ ఇన్ఫ్రా పేరుతో వాసవి, సుమధురతో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టింది. వాసవితో పాటు పలు ప్రాజెక్టులను హానర్స్ సంస్థ చేపట్టింది. కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా హానర్స్ జోక్యం చేసుకుంది.
ఈ క్రమంలో హానర్స్, సుమధుర, వాసవిల పరంపర ఆర్ఎస్ బ్రదర్స్‌పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వాసవి, సుమధురతో కలిసి ఆర్‌ఎస్ బ్రదర్స్ వ్యాపారాలు చేస్తోంది.దీంతో ఐటీ అధికారుల కన్ను షాపింగ్ మాల్స్ మీద పడ్డాయి. దీంతో ఏపీ, తెలంగాణల్లోని పలు షాపింగ్ మాల్స్ లో ఏకకాలంలో 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు ఎకౌంట్స్ లావాదేవీలు..హార్డ్ డిస్క్ లను పరిశీలిస్తున్నారు.