Vietnam Boat Accident : వియత్నాం బోటు ప్రమాదం.. మృతుల వివరాలు వెల్లడించిన భారత రాయబార కార్యాలయం.. ఏపీకి వాసులు వీరే..

Vietnam Boat Accident : వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో 15మంది భారతీయ పర్యాటకులు మరణించినట్లు భారతీయ ఎంబసీ తెలింది. మృతుల వివరాలను వెల్లడించింది.

Vietnam Boat Accident

  • వియత్నాం బోటు ప్రమాదంలో 15మంది మృతి
  • మృతుల వివరాలు వెల్లడించిన భారతీయ ఎంబసీ
  • 10మంది తమిళులు, ముగ్గురు ఏపీ, ఇద్దరు కేరళ వాసులు

Vietnam Boat Accident : వియత్నాం దక్షిణ తీరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఫు క్వాక్ (Phu Quoc) ద్వీపం సమీపంలో జరిగిన ఘోర స్పీడ్‌బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు మృతి చెందారు. సముద్ర విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా స్పీడ్‌బోట్ బోల్తాపడినట్లు వియత్నాం అధికారులు వెల్లడించారు.

Also Read : Boat Capsizes : వియత్నాంలో భారతీయులతో వెళ్తున్న పర్యాటక బోటు బోల్తా.. ఏపీ టూరిస్టులతోసహా పలువురు మృతి

అధికారులు వివరాల ప్రకారం.. బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు, ముగ్గురు సిబ్బంది, ఒక సహాయకుడు ఉన్నారు. ఫు క్వాక్ సమీపంలోని హోస్ మే రుట్ ద్వీపం నుంచి తిరిగి వస్తుండగా.. తీరానికి సుమారు 400 మీటర్ల దూరంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో సముద్రంలో బలమైన గాలులు, ఎత్తయిన అలలు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

బోటు ప్రమాదంలో 15మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా.. 21 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. వారిలో ఇద్దరు పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొంత మంది ప్రయాణికులు బోటులో చిక్కుకోవడం వల్ల మరణించినట్లు.. దీంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.

బోటు ప్రమాదంలో మృతుల వివరాలను భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ ప్రమాదంలో మొత్తం 15మంది మృతి చెందగా.. 10మంది తమిళనాడు వాసులు ఉన్నారు. ముగ్గురు ఏపీకి చెందిన వారు కాగా.. ఇద్దరు కేరళకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో ముగ్గురు తెలుగు వారిలో నల్లపేట ఆదిశేషయ్య, గెల్లి జయలక్ష్మీ, శ్రీధర్ ఉన్నారు.